బిగ్ బాస్ తదితర రియాలిటీ షోలకు అమ్మాయిలు ఆకర్షితులు కాకుండా చూడ్డం కోసమే నిస్వార్ధమైన పోరాటం ప్రారంభించానని యాంకర్ శ్వేతారెడ్డి వెల్లడించారు. మహిళా సంఘాలతో కలిసి విశాఖపట్టణం ప్రెస్ క్లబ్‌లో శ్వేతారెడ్డి మీడియాతో మాట్లాడారు.
బిగ్ బాస్ ఎంపిక ప్రక్రియలో తనకు దారుణమైన పరిస్ధితులు ఎదురయ్యాయని ఆమె ఆరోపించారు. కమిట్‌మెంట్లు, కాస్టింగ్ కౌచ్‌లను నివారించాలంటే బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోలను బ్యాన్ చేయాలని శ్వేతారెడ్డి డిమాండ్ చేశారు. ఈ వివాదంలోకి నాగార్జునను ఎందుకు లాగుతున్నారని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం ఇచ్చారు.
అత్యంత ప్రజాదరణ కలిగిన సినీనటుడు అయిన నాగార్జున ఈ షోకు వ్యాఖ్యాతగా వున్నందునే ఆయనను కలుగజేసుకోమని అభ్యర్ధించానని శ్వేతా రెడ్డి చెప్పుకొచ్చారు. అంతేతప్ప నాగార్జునపై బురదజల్లే ప్రయత్నం తమకు లేదని ఆమె వివరణ ఇచ్చారు.