బిగ్ బాస్-3లో పోటీ చేసేవారు వీరే...

సోమవారం, 15 జులై 2019 (16:22 IST)
మరో వారం రోజుల్లో బిగ్ బాస్-3 ప్రారంభం కానుంది. ఈ మధ్య విడుదలైన ప్రోమో కూడా దుమ్ము దులిపేస్తోంది. అందరి ఆసక్తి ఎవరు పోటీ చేస్తారన్నదానిపైనే ఉంది. ఈసారి ఎవరు పోటీ చేస్తారన్నదానిపై అనేక పేర్లు బయటకు వచ్చాయి. కానీ ఐదుగురు మాత్రం ఇప్పటికే కన్ఫామ్ చేసేశారట.
 
హీరో వరుణ్ సందేశ్, శ్రీముఖి, యాంకర్ సావిత్రి, నటి హేమ, టివి నటి హిమజ కూడా పోటీ చేస్తున్నారట. వీరి పేర్లను ఫైనల్ కూడా చేసేశారట. మొత్తం 40 మందిని సెలక్ట్ చేస్తే వారిలో 14 మంది మాత్రం హౌస్‌లోకి వెళ్ళబోతారట. ఈసారి కామన్ మాన్ ఎవరూ హౌస్‌లోకి వెళ్ళరని సమాచారం.
 
పేర్లు ఖరారు చేసిన వారికి ఇప్పటికే సమాచారం ఇచ్చారని.. అయితే ఆ విషయాన్ని బయటకు చెప్పొద్దంటూ కూడా కోరారట. దీంతో సెలక్ట్ అయిన వారు తమ పేర్లను బయటకు చెప్పుకోకపోయినా.. బిగ్ బాస్ హౌస్ లోని కొంతమంది యూనిట్ సభ్యులే వారి పేర్లను లీక్ చేసేశారు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం డియర్ కామ్రేడ్ జూలై 26న సిద్ధం.. ట్రైలర్‌లో కథంతా చెప్పేశాడు.. లిప్ కిస్‌లు..? (Trailer)