Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెటిజన్‌కు షాకిచ్చిన త్రిష.. హెరాస్ చేయడం పద్ధతేనా?

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో మూడు పదుల వయస్సు దాటినా తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకుని.. అవకాశాలను చేజిక్కించుకుంటున్న నటి త్రిష. టాలీవుడ్‌లో అగ్రహీరోలందరి సరసన నటించిన త్రిష.. కోలీవుడ్‌లోనూ తన హవాను కొనస

Webdunia
బుధవారం, 5 సెప్టెంబరు 2018 (17:31 IST)
దక్షిణాది సినీ ఇండస్ట్రీలో మూడు పదుల వయస్సు దాటినా తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకుని.. అవకాశాలను చేజిక్కించుకుంటున్న నటి త్రిష. టాలీవుడ్‌లో అగ్రహీరోలందరి సరసన నటించిన త్రిష.. కోలీవుడ్‌లోనూ తన హవాను కొనసాగించింది. ఇప్పటికీ హీరోయిన్‌గా కెరీర్ కొనసాగించింది. తాజాగా ఓ బంపర్ ఆఫర్ కొట్టేసింది. 
 
ఏకంగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన అవకాశాన్ని కైవసం చేసుకుంది. త్వరలో త్రిష నటించిన 96 సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి హీరోగా కనిపిస్తున్నాడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. వయస్సు పెరిగినా త్రిష గ్లామర్ ఏమాత్రం తగ్గలేదని.. ఈ సినిమా ట్రైలర్ చూసిన నెటిజన్లంతా కామెంట్లు చేశారు.
 
ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సోషల్ మీడియాలో ఓ నెటిజన్‌ను ఉద్దేశిస్తూ త్రిష చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చకు దారితీసింది. ''నా టైమ్‌లైన్‌లోకి ప్రవేశించి అగౌరవం కలిగించే మాటలు మాట్లాడతావా..? వేరొక యాక్టర్‌ని తిట్టడాన్ని లాయల్టీగా భావిస్తావా..? వేరొకరిని విమర్శించడం హెరాస్ చేయడం పద్ధతేనా..? ఏమనుకుంటున్నావ్... నిన్ను బ్లాక్ చేస్తా'' అంటూ సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చింది. 
 
సోషల్ మీడియాలో తమ అభిమాన తార వద్ద గుర్తింపు సంపాదించుకునేందుకు వేరే సినిమా స్టార్‌ను నిందించడం, అగౌరవంగా మాట్లాడటం నెటిజన్ల ఫ్యాషనైపోయిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Putin: వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోనులో మాట్లాడిన మోదీ.. భారత్‌కు రావాలని పిలుపు

బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి భారీ వర్ష సూచన

Moving Train: కదులుతున్న ప్యాసింజర్ రైలు నుంచి పడిపోయిన మహిళ.. ఏం జరిగింది?

సుంకాల మోత... అమెరికాకు షాకిచ్చిన భారత్ - యుద్ధ విమానాల డీల్ నిలిపివేత?

YSRCP: వైఎస్ఆర్ కడప జిల్లాలో పోలింగ్ కేంద్రాలను తరలించవద్దు.. వైకాపా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments