Webdunia - Bharat's app for daily news and videos

Install App

RX100 హీరోయిన్.. రొమాన్స్ చూశారు.. ఇక యాక్షన్ చూస్తారు..?

నార్త్ బ్యూటీ పాయర్ రాజ్ పుత్ RX100 సినిమాలో హీరోయిన్‌గా నటించి తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తెలుగులో మొదటి సినిమాలోనే బోల్డ్ పెర్ఫార్మన్స్‌తో అదరగొట్టింది. ఈ సినిమాలో హీరోతో ఆమె రొమాంటిక్ సీ

Webdunia
బుధవారం, 5 సెప్టెంబరు 2018 (14:39 IST)
నార్త్ బ్యూటీ పాయర్ రాజ్ పుత్ RX100 సినిమాలో హీరోయిన్‌గా నటించి తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తెలుగులో మొదటి సినిమాలోనే బోల్డ్ పెర్ఫార్మన్స్‌తో అదరగొట్టింది. ఈ సినిమాలో హీరోతో ఆమె రొమాంటిక్ సీన్లు, క్లైమాక్స్‌లో ఆమె నటనకు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ప్రేమించిన వాడిని మోసం చేసే పాత్రలో పాయల్ జీవించేసింది. 
 
ఈ సినిమా తరువాత ఆమెకు వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇటీవల క్యాస్టింగ్ కౌచ్‌పై కూడా ఆమె స్పందించింది. తనకు ఓ నిర్మాత ద్వారా ఆ అనుభవం ఎదురైందని.. కానీ ఇలాంటి విషయాలకు తాను లొంగనని చెప్పింది. కథ నచ్చితేనే సినిమాలు చేస్తానని క్లారిటీ ఇచ్చింది. దానికి తగ్గట్లే తొందర పడకుండా ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటోంది. ఇప్పటికే నిర్మాత సి.కళ్యాణ్ తో సినిమా చేయడానికి అంగీకరించిన పాయల్ తాజాగా దర్శకుడు భానుశంకర్ చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
 
ఇప్పటివరకు అమ్మడులో రొమాంటిక్ యాంగిల్‌లో టాలీవుడ్ ప్రేక్షకులు చూశారు. కానీ పాయల్ ప్రస్తుతం కొత్త కోణంలో కనిపించనుంది. అయితే ఈ సినిమాలో తన పాత్ర భిన్నంగా ఉంటుందని సమాచారం. సినిమాలో ఆమె కొన్ని యాక్షన్ సీన్స్‌లో కూడా నటిస్తుందట. సి.కళ్యాణ్ సినిమా కంటే ముందుగా భానుశంకర్ సినిమానే మొదలుపెట్టాలని పాయల్ భావిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నాకు జగన్ అంటే చాలా ఇష్టం.. ఆయనలో ఆ లక్షణాలున్నాయ్: కల్వకుంట్ల కవిత

పోలీసులను బట్టలూడదీసి కొడతారా? జగన్ క్షమాపణలు చెప్పాల్సిందే: పురంధేశ్వరి

హైదరాబాద్ రెస్టారెంట్‌‌లో బంగారు పూత పూసిన అంబానీ ఐస్ క్రీమ్ (video)

పోసాని కృష్ణ మురళికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట.. ఈ నెల 24కి విచారణ వాయిదా

రీల్స్ కోసం రైలు పట్టాలపై పడుకున్నాడు.. కదిలే రైలు అతనిపై నుంచి పోయింది.. (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments