Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లైంగిక వేధింపుల నిందితుడు.. దిలీప్‌కు అమ్మలో సభ్యత్వం.. హీరోయిన్ రాజీనామా..

మలయాళ సినీ పరిశ్రమకు చెందిన హీరోయిన్ కిడ్నాప్, లైంగిక వేధింపులకు గురైన సంగతి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో సంఘటనలో ప్రధాన నిందితుడు పల్సర్ సునీల్ తో పాటు మరో ఆరుగురిని పోలీసులు అరెస్టు చే

Advertiesment
లైంగిక వేధింపుల నిందితుడు.. దిలీప్‌కు అమ్మలో సభ్యత్వం.. హీరోయిన్ రాజీనామా..
, గురువారం, 28 జూన్ 2018 (09:25 IST)
మలయాళ సినీ పరిశ్రమకు చెందిన హీరోయిన్ కిడ్నాప్, లైంగిక వేధింపులకు గురైన సంగతి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో సంఘటనలో ప్రధాన నిందితుడు పల్సర్ సునీల్ తో పాటు మరో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రముఖ మలయాళ నటుడు దిలీప్ కూడా ఈ సంఘటనలో నిందితుడు. అయితే, బెయిల్ పై జైలు నుంచి దిలీప్ బయటకొచ్చాడు. బెయిల్‌పై బయటికి వచ్చిన అతనికి మళ్లీ మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేన్ (అమ్మ)లో సభ్యత్వం కల్పించారు. 
 
దీనిని నిరసిస్తూ బాధిత హీరోయిన్.. ''అమ్మ''లో తన సభ్యత్వానికి రాజీనామా చేసింది. ఆమెకు మద్దతుగా ముగ్గురు ప్రముఖ నటీమణులు రీమా కళింగల్, రెమ్య నంబిసన్, గీతూ మోహన్ దాస్ కూడా తమ సభ్యత్వాలను వదులుకున్నారు. లైంగిక వేధింపుల కేసులో నిందితుడైన వ్యక్తికి అమ్మలో సభ్యత్వం ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయినప్పటికీ అమ్మ సభ్యులు అవన్నీ పట్టించుకోకుండా నిందితుడికి సభ్యత్వం ఇచ్చారు. 
 
కాగా, ఈ విషయమై బాధిత హీరోయిన్ మాట్లాడుతూ, దిలీప్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా ''అమ్మ''కు ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేదని చెప్పింది. ఇంకా దిలీప్‌ను కాపాడేందుకు అసోసియేషన్ ప్రముఖులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. అందుకే, ఇలాంటి అసోసియేషన్‌లో కొనసాగడం అనవసరమని భావించి తన సభ్యత్వానికి రాజీనామా చేశానని చెప్పింది.
 
మరో నటి గీతూ మోహన్ దాస్ మాట్లాడుతూ.. ఎదురు ప్రశ్నించని వాళ్లని, ఏది చెబితే అది గుడ్డిగా పాటించే వారినే ''అమ్మ'' నాయకత్వం దగ్గరకు తీసుకుంటుందని, తాము నలుగురం తమ నిర్ణయంపై గట్టిగా నిలబడి పోరాడతామని స్పష్టం చేసింది. సోషల్ మీడియాపై అమ్మపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహిళను వేధించిన వ్యక్తిని అమ్మ నెత్తిన పెట్టుకోవడం ఏమిటని నెటిజన్లు మండిపడుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాని చేతుల మీదుగా యాక్ష‌న్ కింగ్ అర్జున్ 150వ సినిమా "కురుక్షేత్రం" ట్రైల‌ర్