Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వ్యభిచారం రాకెట్‌లో హీరోయిన్ల పేర్లు బయటపెట్టిన ఆ దంపతులు..

అమెరికా వ్యభిచారం రాకెట్ బాగోతం సినీ పరిశ్రమలను కుదిపేస్తోంది. ఇప్పటికే కొంతమంది పేర్లు బయటకు రావడంతో పాటు, ఏకంగా శ్రీరెడ్డి ఎవరెవరు ఇందులో ఉన్నారు తనకు తెలుసునని బాంబు పేల్చారు. అయితే వారి పేర్లు ఇప్పుడే బయటపెట్టనని, కొంతమంది మాత్రమే ఇందులో ఉన్నారని

Advertiesment
వ్యభిచారం రాకెట్‌లో హీరోయిన్ల పేర్లు బయటపెట్టిన ఆ దంపతులు..
, బుధవారం, 27 జూన్ 2018 (20:36 IST)
అమెరికా వ్యభిచారం రాకెట్ బాగోతం సినీ పరిశ్రమలను కుదిపేస్తోంది. ఇప్పటికే కొంతమంది పేర్లు బయటకు రావడంతో పాటు, ఏకంగా శ్రీరెడ్డి ఎవరెవరు ఇందులో ఉన్నారు తనకు తెలుసునని బాంబు పేల్చారు. అయితే వారి పేర్లు ఇప్పుడే బయటపెట్టనని, కొంతమంది మాత్రమే ఇందులో ఉన్నారని, వారిలో అగ్ర హీరోయిన్లు కూడా ఉన్నారని చెప్పుకొచ్చారు. డబ్బుల కోసమే హీరోయిన్లు అమెరికాకు వెళ్ళి పడక సుఖమిచ్చి వస్తున్నారని శ్రీరెడ్డి వ్యాఖ్యలు చేశారు. 
 
దీంతో ఒక్కసారిగా వ్యభిచారం రాకెట్ వ్యవహారం మరింత వేడెక్కింది. ఈ రాకెట్లో కీలకపాత్రధారులైన కిషన్, చంద్రకళ దంపతులు ఇప్పటికే ఊచలు లెక్కిస్తున్నారు. ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ పెట్టుకున్నా కోర్టు దాన్ని కొట్టేసింది. దీంతో కిషన్, చంద్రకళను జూలై 9న మరోసారి అమెరికా పోలీసులు విచారించేందుకు సిద్ధమయ్యారు. 
 
ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్న ఈ దంపతులు కొంతమంది హీరోయిన్ల పేర్లు చెప్పారని తెలుస్తోంది. అమెరికా పోలీసులు ఇప్పటికే కొంతమంది హీరోయిన్లను విచారించిన విషయం తెలిసిందే. వచ్చే నెల 9వ తేదీన కిషన్, చంద్రకళలు మరికొంతమంది పేర్లను తెలిపే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే జరిగితే అమెరికా పోలీసులు వ్యభిచారం రాకెట్ ఉదంతంపై ఏ విధంగా ముందుకు వెళతారన్నది ఆసక్తికరంగా మారుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా పెళ్లి తర్వాతే భర్తను చూపిస్తా... రేణూ దేశాయ్, లైవ్ వీడియోలో 'పవన్' హోరు...