Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చికాగో వ్యభిచారం రాకెట్... ఆ ప్రచారంపై మెహరీన్‌కు కోపమొచ్చింది...

అమెరికా పోలీసులు ఛేదించిన వ్యభిచారం రాకెట్ టాలీవుడ్‌లో ప్రకంపనలను సృష్టిస్టూనే ఉంది. అయితే ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేని కొంతమంది పేర్లను కొన్ని యుట్యూబ్ ఛానల్స్ లాగి వారి పరువు తీస్తోందట. అందులో మెహరీన్ కూడా ఉంది. అందాల భామ మెహరీన్ ఇచ్చిన ఇంటర్వ్యూ కన

Advertiesment
చికాగో వ్యభిచారం రాకెట్... ఆ ప్రచారంపై మెహరీన్‌కు కోపమొచ్చింది...
, శుక్రవారం, 22 జూన్ 2018 (18:40 IST)
అమెరికా పోలీసులు ఛేదించిన వ్యభిచారం రాకెట్ టాలీవుడ్‌లో ప్రకంపనలను సృష్టిస్టూనే ఉంది. అయితే ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేని కొంతమంది పేర్లను కొన్ని యుట్యూబ్ ఛానల్స్ లాగి వారి పరువు తీస్తోందట. అందులో మెహరీన్ కూడా ఉంది. అందాల భామ మెహరీన్ ఇచ్చిన ఇంటర్వ్యూ కన్ఫ్యూజన్‌కు దారితీసింది. ముఖ్యంగా యూ ట్యూబ్ ఛానల్స్ ఆమె ఇంటర్వ్యూలో చెప్పిన విషయాన్ని తప్పుగా అర్థం చేసుకుని రచ్చ చేశారని మెహరీన్ బాధపడుతోందట. తాను చెప్పింది ఒకటైతే తన పరువు తీస్తున్నారంటూ మండిపడుతోంది మెహరీన్. 
 
పంతం సినిమా కోసం గోపీచంద్‌తో కలిసి కెనడాకు వెళ్ళింది మెహరీన్. అక్కడ పాట చిత్రీకరణ పూర్తయిన తరువాత అమెరికాలో తన బంధువులను కలిసేందుకు వెళ్ళింది మెహరీన్. అయితే ఇటీవల తెలుగు హీరోయిన్లకు సంబంధించి వ్యభిచారం రాకెట్ ఉదంతం బయటపడటంతో అక్కడి అధికారులు టాలీవుడ్ నుంచి ఎవరు అడుగుపెట్టినా ఎయిర్‌పోర్ట్‌లో పూర్తి విచారణ చేసి నమ్మకం కుదిరాకే పంపుతున్నారు.
 
ఈ ప్రక్రియలో తనకు కూడా అలాంటి చేదు అనుభవం ఎదురైందని మెహరీన్ చెప్పింది. కొందరు నటీమణులు తెలిసీతెలియక ఒక వలలో పడి మొత్తం పరిశ్రమకు బ్యాడ్ నేమ్ తెచ్చారు. దానివల్ల అమెరికాలో ఏ హీరోయిన్ అడుగుపెట్టినా పోలీసులు అవమానిస్తున్నారని బాధపడింది. ఆమె చెప్పిన మాటలు ఇదైతే కొన్ని యు ట్యూబ్ ఛానళ్ళు మెహరీన్‌ను విచారించినట్లుగా వీడియోలు బయటపెట్టారు. దీంతో మెహరీన్ ఆ విషయాన్ని తప్పు పట్టింది. నేను చెప్పింది ఒకటైతే మరొకటి రాస్తారెందుకని మీడియాపై చిందులు తొక్కింది మెహరీన్. తనపై తప్పుడు వార్తలు రాసిన వారిపై పరువు నష్టం దావా వేస్తానంటోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మగాళ్ళ మధ్యే "స్వ‌యంతృప్తి" సీన్‌లో నటించా... అదో ఎక్స్‌పీరియన్స్ : కైరా అద్వానీ (Video)