Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప‌ర‌శురామ్ కోసం వెయిట్ చేస్తోన్న హీరోలు..!

గీత గోవిందం స‌క్స‌స్‌తో ప‌రశురామ్‌కి బాగా డిమాండ్ పెరిగింది. యువ హీరోలు ప‌ర‌శురామ్‌తో సినిమా చేసేందుకు ఇంట్ర‌ెస్ట్ చూపిస్తున్నారు. గీతా ఆర్ట్స్ సంస్థ ప‌ర‌శురామ్ త‌దుప‌రి చిత్రాన్ని కూడా తామే నిర్మిస్తున్న‌ట్టు ఎనౌన్స్ చేసింది. మ‌రోవైపు అత‌నికి అడ్వాన

Advertiesment
ప‌ర‌శురామ్ కోసం వెయిట్ చేస్తోన్న హీరోలు..!
, శనివారం, 18 ఆగస్టు 2018 (19:15 IST)
గీత గోవిందం స‌క్స‌స్‌తో ప‌రశురామ్‌కి బాగా డిమాండ్ పెరిగింది. యువ హీరోలు ప‌ర‌శురామ్‌తో సినిమా చేసేందుకు ఇంట్ర‌ెస్ట్ చూపిస్తున్నారు. గీతా ఆర్ట్స్ సంస్థ ప‌ర‌శురామ్ త‌దుప‌రి చిత్రాన్ని కూడా తామే నిర్మిస్తున్న‌ట్టు ఎనౌన్స్ చేసింది. మ‌రోవైపు అత‌నికి అడ్వాన్స్ ఇచ్చిన నిర్మాత‌లు త‌మ‌తో సినిమా చేయాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. మంచు విష్ణు ఎప్పుడో అడ్వాన్స్ ఇచ్చాడు. అత‌డు ఇప్పుడు సినిమా చేయ‌మంటున్నాడు. కానీ.. గీతా సంస్థ మాత్రం మాకే చేయాలంటుంది.
 
ఇదిలావుంటే... ప‌ర‌శురామ్‌తో సినిమా చేసేందుకు నాగ‌చైత‌న్య‌, సాయిధ‌ర‌మ్ తేజ్ ఇంట్ర‌స్ట్ చూపిస్తున్నార‌ట‌. గీత గోవిందం సినిమా బాగుంది అంటూ అభినందించ‌డంతో పాటు క‌థ రెడీ చెయ్ మ‌నం క‌లిసి సినిమా చేద్దాం అని ఆఫ‌ర్ కూడా ఇస్తున్నార‌ట‌. కానీ... ప‌ర‌శురామ్ ద‌గ్గ‌ర ఇప్పుడు రెండు క‌థ‌లు మాత్ర‌మే ఉన్నాయ‌ట‌. త్వ‌ర‌గా క‌థ‌లు రెడీ చేసి చైతు, తేజుల‌తో కూడా సినిమాలు చేస్తాడేమో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జిగేల్ రాణికి షాకిచ్చిన ప్రభాస్.. ఎందుకో తెలుసా?