Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచ రికార్డు సృష్టించిన రామానంద సాగర్ 'రామాయణం'

Webdunia
శనివారం, 2 మే 2020 (18:26 IST)
33 సంవత్సరాల తరువాత మళ్లీ ప్రసారం అయిన "రామాయణం" ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వీక్షించిన వినోద కార్యక్రమంగా ప్రపంచ రికార్డు సృష్టించింది. కరోనా వైరస్ విజృంభణ క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించిన వెంటనే మార్చిలో దూరదర్శన్ నేషనల్లో రామాయణం ప్రసారం ప్రారంభమైంది. ఏప్రిల్ 16 న ప్రపంచవ్యాప్తంగా 77 మిలియన్ల (7.7 కోట్లు) ప్రజలు ఈ ప్రదర్శనను చూశారని డిడి నేషనల్ ట్విట్టర్ ద్వారా తెలిపింది.
 
"దూరదర్శన్‌లో రామాయణం యొక్క పునఃప్రసారం ప్రపంచవ్యాప్తంగా వీక్షకుల రికార్డులను బద్దలు కొట్టింది, ఈ ప్రదర్శన ఏప్రిల్ 16న 7.7 కోట్ల మంది ప్రేక్షకులతో ప్రపంచంలో అత్యధికంగా వీక్షించిన షోగా నిలిచింది" అని డిడి నేషనల్ అధికారిక ట్విట్టర్లో పోస్ట్ చేసింది.
 
రామనంద్ సాగర్ రాసిన, నిర్మించిన మరియు దర్శకత్వం వహించిన "రామాయణం", 1987లో దూరదర్శన్‌లో మొదటిసారి ప్రసారం చేయబడింది. ఈ సీరియల్లో రాముడిగా అరుణ్ గోవిల్, సీతగా దీపిక చిఖ్లియా తోపివాలా, లక్ష్మణ్ పాత్రలో సునీల్ లాహ్రీ నటించారు. ఇందులో ప్రముఖ నటులు లలితా పవార్ మంతారా, అరవింద్ త్రివేది రావణ, దారా సింగ్ హనుమంతుడిగా నటించారు.
 
కాగా "ఉత్తర రామాయణం" చివరి ఎపిసోడ్ శనివారం ప్రసారం కానుంది. ఈ షో స్థానంలో సాగర్ యొక్క మరో ప్రసిద్ధ సిరీస్ "శ్రీ కృష్ణ" ఉంటుంది, ఇది ఆదివారం నుండి ప్రసారం కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

19 ఏళ్ల కుర్రాడిని తీసుకుని 38 ఏళ్ల మహిళ జంప్, ఇద్దరూ బెంగళూరులో...

YS Viveka Case: ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన వైఎస్ సునీతారెడ్డి.. ఈ కేసు క్లోజ్ కాకపోతే?

Midhun Reddy: ఏపీ మద్య కుంభకోణం-బెయిల్ కోసం ఏసీబీ కోర్టులో మిధున్ రెడ్డి పిటిషన్

జగన్ ఆ విషయంలో నిష్ణాతుడు.. లిక్కర్ స్కామ్‌పై సమాధానం ఇవ్వాలి.. వైఎస్ షర్మిల

జూలై 26 నుంచి 31 వరకు సింగపూర్‌లో చంద్రబాబు పర్యటన.. ఎలా సాగుతుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments