Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ మందు హనుమంతుడు తెచ్చిన సంజీవిని లాంటిది.. మాకూ ఇవ్వండి...

Advertiesment
ఆ మందు హనుమంతుడు తెచ్చిన సంజీవిని లాంటిది.. మాకూ ఇవ్వండి...
, బుధవారం, 8 ఏప్రియల్ 2020 (20:51 IST)
కరోనా వైరస్ ప్రపంచాన్ని కబళిస్తున్న వేళ... ప్రపంచ దేశాలకు భారత్ పెద్దదిక్కుగా మారింది. ఈ కరోనా వైరస్ సోకిన వారికి కొంతమేరకు ఉపశమనం కలిగించే మందు భారత్ వద్ద పుష్కలంగా ఉండటంతో అన్ని దేశాల అధినేతలు భారత్‌ను ఆశ్రయిస్తున్నాయి. ఈ దేశాల్లో చివరకు ప్రపంచ అగ్రరాజ్యం అమెరికా కూడా ఆ మందు కోసం భారత్‌ను ఆశ్రయించింది. 
 
ఈ పరిస్థితుల్లో తాజాగా బ్రెజిల్ కూడా భారత ప్రధాని నరేంద్ర మోడీని సంప్రదించారు. కరోనా రోగుల చికిత్స కోసం ఉపయోగించే హైడ్రాక్సీక్లోరోక్వీన్ కావాలంటూ బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బొల్సనారో హనుమజయంతి రోజున ఓ లేఖ రాశారు. 
 
ఈ లేఖలో రామాయ‌ణ ప్ర‌స్తావ‌న తెచ్చారు. ల‌క్ష్మ‌ణుడిని కాపాడేందుకు హిమాల‌యాల నుంచి హ‌నుమంతుడు సంజీవిని తీసుకువ‌చ్చార‌న్నార‌న్నారు. 
 
అలాగే పేద‌ల‌ను కాపాడేందుకు జీసెస్ కూడా ఎన్నో మ‌హిమ‌లు ప్ర‌ద‌ర్శించి రోగాల‌ను పార‌ద్రోలార‌ని, ఆ రీతిలోనే మాకు హైడ్రాక్సీక్లోరోక్వీన్ మాత్ర‌ల‌ను ఇచ్చి మ‌మ్ముల్ని కాపాడాలంటూ బ్రెజిల్ అధ్య‌క్షుడు బొల్స‌నారో బుధవారం మోడీకి లేఖ రాశారు. 
 
ఈ సందర్భంగా బ్రెజిల్‌కు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ భరోసా ఇచ్చినట్టు తెలుస్తోంది. మొత్తంమీద మందులేని కరోనా వైరస్‌కు ప్రస్తుతం భారత్ వద్ద ఉన్న హైడ్రాక్లీక్లోరోక్వీన్ ఓ దివ్యౌషధంగా మారింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్లీజ్, అర్థం చేసుకోండి, రోడ్లపైకి రావద్దండి: రోజా విజ్ఞప్తి