Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రామాయణం: అంగధుడే నాకు స్ఫూరి.. వీరేంద్ర సెహ్వాగ్

Advertiesment
రామాయణం: అంగధుడే నాకు స్ఫూరి.. వీరేంద్ర సెహ్వాగ్
, సోమవారం, 13 ఏప్రియల్ 2020 (14:21 IST)
Sehwag
రామాయణంలో సీతను రావణుడు అపహరించిన తర్వాత సంధికోసం వెళ్లిన అంగధుడు అక్కడ ఉన్న లంకేయులతో సవాల్‌ చేస్తాడు. తన పాదాన్నిఎవరైనా కదిపితే.. శ్రీరాముడు ఓటమిని అంగీకరించినట్లే అని అంగధుడు అంటాడు. అయితే అంగధుడి పాదాన్ని కదిపేందుకు లంకేయులు ప్రయత్నించి విఫలం అవుతారు. ఇదే విషయాన్ని తనకు ఆపాదించుకున్న సెహ్వాగ్‌ తన ఫుట్‌వర్క్‌ని ఏ ఒక్కరూ మార్చలేకపోయారని చెప్పకనే చెప్పేశాడు. 
 
అంతేగాకుండా.. లాక్‌డౌన్‌ కారణంగా టీవీలో ప్రసారం అవుతున్న రామాయణాన్ని వీక్షించినట్లు ఉన్న సెహ్వాగ్‌.. ఈ మేరకు ఒక ఫోటోను పోస్ట్‌ చేశాడు.   రామాయణ పురాణంలోని వానర సైన్యంలో ఒకరైన అంగధుడ్ని ప్రేరణగా తీసుకున్నట్లు సెహ్వాగ్ చెప్పాడు. ప్రత్యేకంగా తన ఫుట్‌వర్క్‌ని అంగధుడితో పోల్చుకున్నాడు సెహ్వాగ్‌. 
 
కాగా వీరేంద్ర సెహ్వాగ్ నిల్చున్న చోట నుంచే ఒక్క అంగుళం కూడా కదలకుండా భారీ షాట్లు ఆడేయగలడు. తన ఆటతో క్రికెట్‌కే వన్నె తెచ్చిన సెహ్వాగ్‌.. ఫుట్‌వర్క్‌పై ఇప్పటికీ చాలామందికే అనుమానాలున్నాయి. 
 
అసలు లెగ్‌ మూమెంటే లేకుండా ఎలా విరుచుకుపడతాడనే సందేహం చాలామందిలో ఉంది. అప్పట్లో సెహ్వాగ్‌ ఫుట్‌వర్క్‌పై చాలామంది విమర్శలు వచ్చాయి. అందుకు బ్యాట్‌తోనే సమాధానం చెబుతూ ఉండటంతో విమర్శకులు కూడా ఏమీ మాట్లాడలేకపోయేవారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒకే ఒక్కడు : బ్రియాన్ లారా రికార్డు ఇప్పటికీ పదిలమే