Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఆదిపురుష్‌'కు ఆరంభంలోనే అపశృతి

Webdunia
మంగళవారం, 2 ఫిబ్రవరి 2021 (21:17 IST)
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఆదిపురుష్. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ మంగళవారం నుంచి ప్రారంభమైంది. ఈ మేరకు చిత్ర యూనిట్ ఓ ట్వీట్ చేసింది. ఆదిపురుష్ ఆరంభమైందంటూ తెలిపింది. 
 
అయితే, ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్ళిన తొలిరోజే అపశ్రుతి చోటుచేసుకుంది. ముంబైలోని గోరేగావ్ ఫిల్మ్ స్టూడియోలో 'ఆదిపురుష్' షూటింగ్ ప్రారంభమైంది. అయితే, షూటింగ్ స్పాట్‌లో అగ్నిప్రమాదం సంభవించింది.
 
ఈ ఘటనలో గ్రీన్ స్క్రీన్ క్రోమా సెటప్ పూర్తిగా కాలిపోయినట్టు తెలిసింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక దళ సిబ్బంది హుటాహుటీన వచ్చి మంటలను ఆర్పివేశారు. ప్రమాదం జరిగిన సమయంలో హీరో ప్రభాస్, విలన్ సైఫ్ అలీఖాన్ సెట్స్‌పై లేరు.
 
దర్శకుడు ఓం రౌత్ ఇతర సన్నివేశాలు చిత్రీకరిస్తున్న సమయంలో ఒక్కసారిగా అగ్నికీలలు చెలరేగడంతో షూటింగ్ స్పాట్‌లో తీవ్ర ఆందోళన నెలకొంది. అయితే, యూనిట్ సభ్యులకు ఎలాంటి ప్రమాదం వాటిల్లకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇష్టం లేని పెళ్లి చేయొద్దంటే వింటే కదా! 27మందికి పాలలో ఎలుకల మందు కలిపిచ్చిన యువతి!

Amaravati: అమరావతికి 20,494 ఎకరాల భూ సమీకరణకు సీఆర్డీఏ ఆమోదం

అక్రమ సంబంధం.. ప్రియుడి కోసం భర్తను గొంతు నులిమి చంపేసిన భార్య

Navi Mumbai: భార్య, అత్తలతో నగ్నంగా క్షుద్రపూజలు.. ఆపై ఫోటోలు లీక్ చేశాడు..

Microsoft: పాకిస్తాన్‌లో మైక్రోసాఫ్ట్ ఆఫీసుకు తాళం.. కారణం ఇదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments