Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకు పోలీస్ క‌థ‌లంటే ఇష్టంః రామ్‌చ‌ర‌ణ్‌

మ‌గ‌ధీర‌, ధృవ‌, రంగ‌స్థ‌లం చూశాః సిపి. స‌జ్జ‌నార్‌

Webdunia
మంగళవారం, 2 ఫిబ్రవరి 2021 (19:35 IST)
Ramcharan, Ramesh, Sajjanar
రామ్ చ‌ర‌ణ్ త‌న‌కు పోలీస్ నేప‌థ్యంలో వ‌చ్చే క‌థ‌లంటే చాలా ఇష్టమ‌ని ప్ర‌క‌టించాడు. మంగ‌ళ‌వారంనాడు సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ ఆవరణలో జరుగుతున్న స్పోర్ట్స్ మీట్ ముగింపు వేడుకలకు హాజరైన మెగా పవర్ స్టార్  రాంచరణ్, ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపూరి రమేష్. పాల్గొన్నారు. సీపీ సజ్జనార్ వారితో వున్నారు. ఈ సంద‌ర్భంగా వారి నుద్దేశించి రామ్‌చ‌ర‌ణ్ స్పూర్తి దాయ‌కంగా మాట్లాడారు.
 
 రాంచరణ్ మాట్లాడుతూ, ప్ర‌తి వ్య‌క్తికి జీవితంలో గెలుపు ఓట‌ములు స‌హజం. అది ఏరంగంలోనైనా స‌రే. ముఖ్యంగా క్రీడ‌ల‌లో అది మ‌రింత ముఖ్యం. తాను గుర్రం రేస్‌ల‌లో పాల్గొన్న‌ప్పుడు కూడా ఇదే ఆలోచిస్తాను. అందుకే ఆస‌క్తి వున్న‌వారికి  గుర్ర‌పు స్వారీ కూడా మా సంస్థ ఆధ్వ‌ర్యంలో నేర్పిస్తున్నాను.  సినిమా ప‌రంగా పోలీసు కథలు అంటే ఇష్టం. ఇంత‌కుముందు పోలీస్ పాత్ర‌లు పోషించాను. కోవిడ్ టైంలో వారిపై మ‌రింత ప్రేమ‌క‌లిగింది. పోలీసులు సైనికుల్లా ప‌నిచేశారు. ప్ర‌జ‌ల్ని బ‌య‌ట‌కు రాకుండా కాపాడారు అని తెలిపారు.
 
 సైబరాబాద్ సీపీ మాట్లాడుతూ., నాలుగు రోజుల నుండి క్రీడల్లో పోలీసులు ఉత్సాహంగా పాల్గొన్నారు. క్రీడల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేయడానికి వచ్చిన సినీ నటుడు రాంచరణ్, ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపూరి రమేష్ లకు ధన్యవాదాలు తెలియ‌జేస్తున్నా.  అలాగే రాంచరణ్ నటించిన మగధీర, ధృవ, రంగస్థలం సినిమాలు చూశాను. చాలా బాగున్నాయి.  కోవిడ్ టైంలో ఫేషెంట్ల‌కు ప్లాస్మా ద్వారా 8 వేల మంది ప్రాణాలు కాపాడగలిగాం అని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మా ఇల్లు బఫర్‍‌జోన్‌లో ఉందా... హైడ్రా కమిషనర్ క్లారిటీ!!

శంషాబాద్ ఎయిర్ పోర్టులో అరుదైన విదేశీ పాములు.. ఎలా వచ్చాయంటే?

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం : ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు

జమిలి ఎన్నికలపై చంద్రబాబు ఏమన్నారు..? 2029లోనే ఏపీ ఎన్నికలు?

మహారాష్ట్రలో నేడు కొలువుదీరనున్న మహాయుతి సర్కారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments