Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీ సిటీలో పానాసోనిక్‌ లైఫ్‌ సొల్యూషన్స్‌ ఇండియా తయారీ కేంద్రానికి భూమి పూజ

Advertiesment
Panasonic Life Solutions India
, సోమవారం, 25 జనవరి 2021 (18:00 IST)
పానాసోనిక్‌ కార్పోరేషన్‌కు పూర్తి అనుబంధ సంస్ధ అయి పానాసోనిక్‌ లైఫ్‌ సొల్యూషన్స్‌ ఇండియా నేడు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సిటీ వద్ద తమ నూతన తయారీకేంద్రానికి భూమిపూజను నిర్వహించింది. ఈ కంపెనీ మొత్తం రెండు దశలలో 600 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టాలని ప్రణాళిక చేసింది.
 
గతంలో ప్రకటించిన 294.7 కోట్ల రూపాయలు, మొదటి దశలో కంపెనీ యొక్క విస్తృతశ్రేణి తయారీ మరియు విస్తరణ ప్రణాళికలలో భాగం కావడంతో పాటుగా భారతదేశంలో మౌలిక వసతులకు మద్దతునందించడం మరియు ఉత్పాదక సామర్థ్యం మెరుగుపరచడానికి తోడ్పడుతుంది. ఈ కేంద్రం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధి అవకాశాలను సృష్టించడంతో పాటుగా పారిశ్రామిక అభివృద్ధికి సైతం మద్దతునందించడాన్ని లక్ష్యంగా చేసుకుంది.
 
ఈ భూమి పూజ వేడుక కార్యక్రమాన్ని శ్రీ సిటీకి చెందిన పలువురు అధికారులు మరియు నిర్మాణ కంపెనీ తకెనాకా ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంబంధిత అధికారుల సమక్షంలో కోవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ తెత్యుయాసు కావామోటో, మేనేజింగ్‌ డైరెక్టర్‌, పానాసోనిక్‌ లైఫ్‌ సొల్యూషన్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఈ కార్యక్రమంలో వర్ట్యువల్‌గా పాల్గొన్నారు.
 
నిర్మాణం పూర్తయిన తరువాత ఈ నూతన కేంద్రం, పానాసోనిక్‌ లైఫ్‌ సొల్యూషన్స్‌ ఇండియా యొక్క ఎనిమిదవ విద్యుత్‌ యంత్రసామాగ్రి ఉత్పత్తి కేంద్రంగా భారతదేశంలో నిలుస్తుంది. అంతకుముందు ఉత్తర మరియు పశ్చిమ భారతదేశాలలో ఈ సదుపాయాలు ఉన్నాయి. ఈ కేంద్రంలో కంపెనీ అందించే విద్యుత్‌ యంత్ర సామాగ్రి పదార్ధాలు మరియు వైరింగ్‌ ఉపకరణాలు కోసం అత్యాధునిక అసెంబ్లీ లైన్‌ ఉంది. ఈ ప్రాజెక్ట్‌ను 33 ఎకరాల భూమిలో 133,546 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సిటీ ఇండస్ట్రీయల్‌ పార్క్‌ వద్ద నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా ప్రత్యక్షంగా 600 మందికి 2022 నాటికి ఉపాధి అవకాశాలను కల్పించనున్నారు. మహమ్మారి వాతావరణం కారణంగా ఈ నూతన యూనిట్‌ తమ ఎలక్ట్రికల్‌ అప్లయెన్సెస్‌ తయారీ కార్యక్రమాలను ఏప్రిల్‌ 2022 నాటికి ప్రారంభించనుంది.
 
ఈ సందర్భంగా శ్రీ తెత్యుయాసు కవామోటో, మేనేజింగ్‌ డైరెక్టర్‌, పానాసోనిక్‌ లైఫ్‌ సొల్యూషన్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ మాట్లాడుతూ, ‘‘గృహాభివృద్ధి మరియు రియల్‌ ఎస్టేట్‌ పరంగా ఇండియా గణనీయంగా అభివృద్ధి చెందుతుంది. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో మహమ్మారి అనంతర కాలంలో గణనీయమైన మార్పు కనిపిస్తుంది. మహమ్మారి కారణంగా వ్యాపారాలు ఆగిపోయాయి. అయితే, మా వృద్ధి ప్రయాణం మాత్రం పునరుద్ధరించబడుతుందనే ఆశాభావంతో ఉన్నాం. తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకుంటుందని ఆశిస్తున్నాం.
 
శ్రీసిటీలోని ఈ నూతన కేంద్రం ఒకసారి పూర్తి అయిందంటే, భారతదేశంలో మా ఉత్పత్తిని గణనీయంగా వృద్ధి చేయడం సాధ్యమవడంతో పాటుగా ఆంధ్రప్రదేశ్‌లో స్థానికులకు ఉపాధి అవకాశాలను అందించడమూ వీలవుతుంది. ప్రభుత్వ లక్ష్యమైన ఆత్మనిర్భర్‌ భారత్‌కు పూర్తి మద్దతునందిస్తూ, ఈ ప్రాంతంలో మా ప్రాజెక్ట్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వంతో మా సంబంధాలను సైతం బలోపేతం చేయడంలో సహాయపడనుంది’’ అని అన్నారు.
 
భారతదేశంలో, పానాసోనిక్‌ లైఫ్‌ సొల్యూషన్స్‌ ఫ్యాక్టరీలు హరిద్వార్‌లో ఉన్నాయి. ఇవి ఉత్తరాది డిమాండ్‌ను తీరుస్తున్నాయి. డామన్‌ మరియు కచ్‌లలోని ఫ్యాక్టరీలు పశ్చిమ మార్కెట్‌ అవసరాలను తీరుస్తున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపిలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్, వివరాలు