Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్ర‌భాస్ ఆదిపురుష్ సెల‌బ్రేష‌న్ ఆరంభం!

Advertiesment
ప్ర‌భాస్ ఆదిపురుష్ సెల‌బ్రేష‌న్ ఆరంభం!
, మంగళవారం, 2 ఫిబ్రవరి 2021 (11:52 IST)
Prabhas, Safi Alikhan, aadipursh
ప్ర‌భాస్ న‌టిస్తున్న తాజా చిత్రం `ఆదిపురుష్‌`. ఇందులో సైఫీఅలీఖాన్ రావ‌ణుడుగా న‌టిస్తున్నాడు. రామ రావణ యుద్ధంలో ధ‌ర్మం, అధ‌ర్మం ఏది గెలుస్తుందే అంద‌రికీ తెలిసిందే. అలాగే `సెల‌బ్రేటింగ్‌ విక్ట‌ర్ ఆఫ్ గుడ్ ఓవ‌ర్ ఈవెల్‌` అంటూ మంగ‌ళ‌వారంనాడు షూటింగ్ ప్రారంభ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు  ఓంరౌత్ ట్వీట్ చేశాడు. ప్ర‌భాస్‌ను బాహుబ‌లి త‌ర్వాత ఆ స్థాయిలో చూపించాల‌న్న‌ది ద‌ర్శ‌క నిర్మాత‌ల ఆలోచ‌న. అందుకోసం భిన్న‌మైన క‌థ‌ను ఎన్నుకున్నారు.
 
అయినా స‌రే ప్ర‌భాస్ లాక్‌డౌన్ త‌ర్వాత సినిమాలు ఒక‌దాని త‌ర్వాత చేస్తూ ముందుకు సాగుతున్నాడు. పాన్ ఇండియా మూవీ కాబ‌ట్టి ఇందుకు త‌గిన విధంగా ప్లాన్ చేస్తున్నారు. రాధేశ్యామ్ ఇప్ప‌టికే పోస్ట్‌ప్రొడక్ష‌న్ ప‌నులు సాగుతున్నాయి.  కాగా, ఇది గొప్ప యాగం అని ద‌ర్శ‌కుడు పేర్కొంటున్నాడు. అలాంటి మహా యాగం ప్రాజెక్ట్ బాలీవుడ్ దర్శకుడు తెరకెక్కిస్తున్న “ఆదిపురుష్” అనే చెప్పాలి.
 
భారీ ఇతిహాస చిత్రంగా దీనిని తెరకెక్కిస్తుండడంతో దేశ వ్యాప్తంగా దీనిపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. రాముని పాత్రలో ప్రభాస్ రావణ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్న ఈ చిత్రం చిత్రీక‌ర‌ణ మంగ‌ళ‌శారం ముంబైలో మొదలయ్యినట్టుగా దర్శకుడు ఓంరౌత్ సింపుల్ గా అనౌన్సమెంట్ ఇచ్చి కన్ఫర్మ్ చేశారు. కొన్ని రోజుల కితమే ఈ చిత్రం తాలుకా మోషన్ క్యాప్చర్ పనులు కూడా మొదలు పెట్టేసిన సంగతి తెలిసిందే. ఇక నేటినుంచి ఏదో ఒక ప్ర‌త్యేక‌మైన రోజునాడు ఆదిపురుష్ గురించి మ‌రిన్ని అప్‌డేట్స్ రానున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నమిత జిమ్లో ఫిజిక్కు ఫిదా