Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Actor Krishnamrajuకు పుట్టినరోజు శుభాకాంక్షలు.. సినీ కెరీర్‌లో యాభై ఏళ్లు పూర్తి..

Advertiesment
Actor Krishnamrajuకు పుట్టినరోజు  శుభాకాంక్షలు.. సినీ కెరీర్‌లో యాభై ఏళ్లు పూర్తి..
, బుధవారం, 20 జనవరి 2021 (13:09 IST)
రెబల్‌స్టార్‌గా ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిరస్థానాన్ని సంపాదించుకున్న కృష్ణంరాజు ఎన్నో విలక్షణ కథా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. నటుడిగా యాభై సంవత్సరాల కెరీర్ పూర్తిచేసుకున్న కృష్ణం రాజు ఎంతోమంది గొప్ప దర్శకులు, సాంకేతిక నిపుణులతో కలిసి పనిచేశారు. సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో మైలురాయి చిత్రాల్లో నటించి మెప్పించిన కృష్ణం రాజు పుట్టిన రోజు నేడు (జనవరి 20). 
 
సినీ కెరీర్‌లో యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్న కృష్ణంరాజు రాజకీయాల్లో సైతం రాణించారు. రెండు సార్లు ఎంపీగా గెలిచిన ఈ రెబల్ స్టార్ కేంద్ర సహాయమంత్రిగా కూడా పనిచేశారు. కృష్ణం రాజు నటవారసుడిగా అడుగుపెట్టిన ప్రభాస్‌ హిట్ చిత్రాలతో ముందుకుసాగుతున్నారు.
 
1940 జనవరి 20న జన్మించిన కృష్ణంరాజు తెలుగు చిత్రసీమలో హీరోగా వచ్చి విలన్‌గా మారి, మళ్ళీ హీరోగా విజయం చూసిన ఘనుడు. చిలక గోరింక' చిత్రంలో హీరోగా అడుగు పెట్టిన కృష్ణంరాజు తొలి సినిమాతోనే పరాజయాన్ని చవిచూశారు. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలన్నట్టు చిత్రసీమనే నమ్ముకొని సాగారు. తిరుగులేని నటుడిగా గుర్తింపు పొందారు.
 
చలసాని గోపి, చేగొండి హరిబాబు వంటి మిత్రులతో కలసి గోపీకృష్ణా మూవీస్ పతాకాన్ని నెలకొల్పి తొలి ప్రయత్నంగా 'కృష్ణవేణి' చిత్రాన్ని నిర్మించారు. ఆ సినిమా విజయం సాధించడంతో తరువాత ఆ చిత్ర కథానాయిక వాణిశ్రీ హీరోయన్ గానే భక్త కన్నప్పను నిర్మించి తిరుగులేని హిట్ సాధించారు. ఆ సినిమాతో కృష్ణంరాజు పేరు మార్మోగిపోయింది.
 
ఆయన నటనకు ఎన్నో అవార్డులు, రివార్డులు ఆయన సొంతమయ్యాయి. అమరదీపం చిత్రానికి నటుడిగా తొలి నంది అవార్డును అందుకున్నారు. బొబ్బిలి బ్రహ్మన్నతో రెండో నందిని అందుకున్నారు. ఈ రెండు చిత్రాలకు కె.రాఘవేంద్రరావు దర్శకుడు కావడం విశేషం. దాసరి నారాయణ రావుతో కృష్ణంరాజు మాస్ హీరో ఇమేజ్ తెచ్చిపెట్టాయి. కటకటాల రుద్రయ్య, రంగూన్ రౌడీ సినిమాలతో రెబల్ స్టార్‌గా ప్రజల హృదయాల్లో చోటుసంపాదించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాధిక నా తల్లి కాదు.. అయినా ఫ్రెండ్లీగా వుంటారు.. రహస్యాలను..?: వరలక్ష్మి