Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దరఖాస్తులు వెల్లువతో తుది గడువును రెండు వారాలు పొడిగించిన బీఏఎఫ్ టీఏ బ్రేక్ త్రూ ఇండియా

Advertiesment
BAFTA Breakthrough India
, గురువారం, 21 జనవరి 2021 (22:33 IST)
బీఏఎఫ్ టీఏ బ్రేక్ త్రూ ఇండియాకు దరఖాస్తు గడువును 2021 జనవరి 25 నుంచి 2021 ఫిబ్రవరి 8 వరకు  రెండు వారాల పాటు బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ (బీఏఎఫ్ టీఏ) పొడిగించింది. నెట్ ఫ్లిక్స్ సహకారంతో చేపట్టిన ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా దరఖాస్తుల వెల్లువను సృష్టించింది. దీంతో దరఖాస్తుల తుదిగడువును రెండు వారాల పాటు పొడిగించక తప్పలేదు. బీఏఎఫ్ టీఏ బ్రేక్ త్రూ ఇండియా అనేది భారత్ లోకి బీఏఎఫ్ టీఏ రాకకు సంకేతంగా నిలుస్తుంది. సినిమా, గేమ్స్, టెలివిజన్‌లలో యూకే, యూఎస్ఏ, చైనాలకు తోడుగా రాబోయే తరాల నుంచి ప్రతిభావంతుల ప్రతిభను ప్రదర్శించడంతో పాటుగా వారిని తీర్చిదిద్దుతుంది.
 
ప్రముఖ సంగీత దర్శకుడు, బీఏఎఫ్ టీఏ ప్రచారకర్త ఏ.ఆర్ రెహమాన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘బీఏఎఫ్ టీఏ బ్రేక్ త్రూ ఇండియాకు దేశవ్యాప్తంగా లభిస్తున్న స్పందన నాకెంతో గర్వకారణం. దేశం నలుమూలల నుంచి మేం దరఖాస్తులు స్వీకరించాం. దేశం నలుచెరుగులా ప్రతిభను కనుక్కోవచ్చునని ఇది నిరూపిస్తోంది. దరఖాస్తుల దాఖలుకు తుదిగడువును బీఏఎఫ్ టీఏ ఫిబ్రవరి 8 సోమవారం దాకా పెంచడం నాకెంతో ఆనందం కలి గిస్తోంది. సినిమా, గేమ్స్, టెలివిజన్‌లలో ప్రతిభావంతులైన భారతీయులు దీంతో ప్రమేయం కలిగి ఉండేలా, తమ దరఖాస్తులను సమర్పించేలా వారిని నేను ప్రోత్సహిస్తున్నాను. ఇది వారి జీవితాలను మార్చివేసే అవకాశం’’ అని అన్నారు.
 
 ‘‘బీఏఎఫ్ టీఏ బ్రేక్ త్రూ అనేది ఎంతగానో విజయవంతమైన బ్రేక్ త్రూ కార్యక్రమానికి అంతర్జాతీయ వెర్షన్. యూకేలో ఇది 2013 నుంచి నిర్వహించబడుతోంది. చైనాలో ఇది 2019లో ప్రారంభమైంది. అమెరికా, భారత్‌లలో 2020లో ప్రారంభమైంది. ఇప్పటివరకూ 160 మంది వర్ధమాన కళాకారులకు ఇది అండగా నిలిచింది. ఈ దేశాల్లో సినిమా, గేమ్స్, టెలివిజన్‌లలో ప్రతిభావంతులైన వారిని ప్రోత్సహిస్తోంది మరియ ఆ దేశాల మద్య కల్చరల్ ఎక్స్‌ఛేంజ్‌కు అవకాశం కల్పిస్తోంది. ఇక ఇప్పుడు భారత్‌లో కూడా.   
 
టామ్ హాలండ్, లెటిటియా రైట్, ఫ్లోరెన్స్ పగ్, జెస్సీ బక్లే, జోష్ ఒకొనర్, కలుమ్ టర్నర్ వంటి వ్యక్తులు ఈ కార్యక్రమానికి అండగా నిలిచారు. ఇటీవలి కాలంలో నటులు ఒలివా కోల్‌మాన్, టిల్డా స్వింటన్, నటుడు, నిర్మా త బ్రాడ్‌పిట్, దర్శకులు టామ్ హార్పర్, బారీ జెన్ కిన్స్, గేమ్ డిజైనర్లు బ్రెండా రొమెరొ, టిమ్ షాఫెర్, నటు లు, రచయితలు షరాన్ హార్గన్, అమీ షుమెర్ సైతం ఈ కార్యక్రమానికి ఇటీవలి కాలంలో అండగా నిలిచారు.
 
బీఏఎఫ్ టీఏ బ్రేక్ త్రూ ఇండియాలో కింద ఎంపికైన వారు ఏడాది కాలం మెంటరింగ్, గైడెన్స్ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం పొందుతారు. ఎంపికైన వారు వన్ టు వన్ మెంటరింగ్, గ్లోబల్ నెట్ వర్కింగ్ అవకాశాలను పొందగలుగుతారు. బీఏఎఫ్ టీఏ కార్యక్రమాలకు, స్ర్కీనింగ్‌లకు 12 నెలల పాటు ఉచిత యాక్సెస్ ఉంటుంది. పూర్తిస్థాయి వోటింగ్ బీఏఎఫ్‌టీఏ సభ్యత్యం ఉంటుంది. ఎంపికైన ప్రతిభావంతులు బ్రిటిష్, భారతీయ పరిశ్రమల్లోని కొంతమంది ప్రముఖుల నుంచి నేర్చుకునే అవకాశాలను, ప్రపంచవ్యాప్తంగా తమ లాంటి వారితో తమ నైపుణ్యాలను పంచుకునే అవకాశాలను పొందుతారు. భౌగోళిక సరిహద్దులకు అతీతంగా అవకాశాలను పొందగలుగుతారు. బీఏఎఫ్ టీఏ బ్రేక్ త్రూ కళాకారులుగా ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్ చేయబడుతారు.
 
దరఖాస్తు చేసుకునేందుకు bafta.orgలో సపోర్టింగ్ టాలెంట్ ఎంపిక చేసి అందులో బ్రేక్ త్రూ- బఫ్తా బ్రేక్ త్రూ ఇండియా ఎంపిక చేసి అప్లై చేయవచ్చు. దరఖాస్తు దాఖలు నాటికి దరఖాస్తుదారులు 18 ఏళ్ళకు పైబడిన వయస్సు కలిగిఉండాలి. భారతదేశంలో కనీ సం 2 ఏళ్లుగా నివసిస్తూ ఉండాలి. ఇంగ్లీషులో మాట్లాడడంలో ప్రావీణ్యం ఉండాలి. సినిమా, గేమ్స్, టీవీలలో భిన్న సంస్కృతుల మధ్య సంబంధాలను పెంచాలనే లక్ష్యంతో రూపుదిద్దుకున్న ఈ కార్యక్రమంలో అభ్యర్థులు తమ నైపుణ్యాలను యూకే వారితో పంచుకోవాలి లేదా యూకే వీక్షకుల కోసం కంటెంట్‌ను రూపొందించాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

''సూప‌ర్ ఓవ‌ర్''తో ప్ర‌వీణ్ వ‌ర్మ‌తో చేసిన జ‌ర్నీని మ‌ర‌చిపోలేం..