Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా పక్కన నిధి అగర్వాల్ అయితే బాగుంటుంది..? పూరీతో ‘ఇస్మార్ట్ శంకర్'

Webdunia
మంగళవారం, 29 జనవరి 2019 (17:05 IST)
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్‌ల కాంబినేషన్‌లో వస్తున్న ఇస్మార్ట్ శంకర్ చిత్రం ఇటీవలే ప్రారంభమయ్యింది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా నిధి అగర్వాల్‌ని ఎంపిక చేసినట్లు అధికారికంగా వెల్లడించారు.

నిధి అయితే తన సరసన ఈ చిత్రంలో పర్ఫెక్టుగా వుంటుందని రామ్ చెప్పడంతో బుక్ చేసినట్లు చెప్పుకుంటున్నారు. అందం అభినయంతో ఆకట్టుకున్న నిధి అగర్వాల్‌కి తెలుగులో ఇది మూడో సినిమా. ప్రస్తుతం హైదరాబాద్‌లో భారీ యాక్షన్ సీన్స్ చిత్రీకరణ జరుపుకుంటుండగా, హీరో రామ్ షూటింగ్‌లో పాల్గొంటున్నాడు.
 
రియల్ సతీష్ ఈ యాక్షన్ ఎపిసోడ్‌కి కొరియోగ్రఫీ చేస్తున్నాడు. త్వరలో నిధి అగర్వాల్ షూటింగ్‌లో పాల్గొననుంది. పునీత్ ఇస్సార్, సత్య దేవ్, మిలింద్ గునాజి, ఆశిష్ విద్యార్థి మరియు గెటప్ శ్రీను ఇతర పాత్రల్లో నటిస్తుండగా, మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు. పూరీ జగన్నాధ్ టూరింగ్ టాకీస్, పూరీ కనెక్ట్స్ పతాకాలపై పూరీ జగన్నాధ్, ఛార్మి కౌర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాని మే నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
 
రామ్ పోతినేని, నిధి అగర్వాల్, పునీత్ ఇస్సార్, సత్య దేవ్, మిలింద్ గునాజి, ఆశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను, సుధాన్షు పాండే, మధు సింగంపల్లి, కుల్దీప్ సింగ్, దీపక్ శెట్టి త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి దర్శకుడు: పూరి జగన్నాధ్, నిర్మాతలు: పూరి జగన్నాధ్, చార్మీ కౌర్, సమర్పణ: లావణ్య, బ్యానర్లు: పూరి జగన్నాధ్ టూరింగ్ టాకింగ్స్, పూరి కనెక్ట్స్, సంగీతం: మణిశర్మ, సినిమాటోగ్రఫీ: రాజ్ తోట, ఆర్ట్ డైరెక్టర్: జానీ షైక్, ఎడిటర్: జునైద్ సిద్ధిఖి, పాటల రచయిత: భాస్కరభట్ల, ఫైట్స్ : రియల్ సతీష్, పి.ఆర్.ఓ: వంశీ - శేఖర్.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments