Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడితో పడకసుఖం కోసం భర్తను చంపేసింది...

ప్రియుడితో పడకసుఖం పొందేందుకు కట్టుకున్న భర్తను నిర్దాక్షిణ్యంగా చంపేసిన ఓ భార్య. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని నాగర్‌కర్నూల్ పట్టణంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,

Webdunia
ఆదివారం, 10 డిశెంబరు 2017 (08:41 IST)
ప్రియుడితో పడకసుఖం పొందేందుకు కట్టుకున్న భర్తను నిర్దాక్షిణ్యంగా చంపేసిన ఓ భార్య. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని నాగర్‌కర్నూల్ పట్టణంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
జిల్లాలోని కొత్తకోట మండలం అజ్జకోలు గ్రామానికి చెందిన రాజేష్‌ అనే యువకుడితో సుధాకర్‌ రెడ్డి అనే వ్యక్తి భార్య స్వాతికి వివాహేతర సంబంధం ఉంది. ప్రియుడి రాజేష్‌తోనే పడకసుఖం పొందేందుకు ఆసక్తిచూపింది. దీనికి భర్త అడ్డుగా ఉండటంతో ఆమెకు సాధ్యపడలేదు. 
 
దీంతో భర్త అడ్డు తొలగించుకోవాలని భావించిన స్వాతి తన ప్రియుడు రాజేష్‌తో కలిసి ‌భర్తను హత్య చేయాలని కుట్రపన్నింది. ఈ క్రమంలో నాగర్‌కర్నూల్‌లో సుధాకర్‌రెడ్డి నివసిస్తున్న ఇంట్లోనే అతనిపై దాడి చేసి శవాన్ని కారులో తీసుకెళ్లి నవాబుపేట ప్రాంతంలో పెట్రోల్‌ పోసి నిప్పంటించినట్లు తెలిసింది. పెట్రోల్‌ పోసి నిప్పంటించే క్రమంలో స్వాతి ప్రియుడు రాజేష్‌ గుర్తుపట్టలేనంతగా కాలిపోయాడు.
 
దీంతో సుధాకర్‌ రెడ్డి దుస్తులను రాజేష్‌కు తొడిగించిన స్వాతి.. తన భర్త స్థానంలో ప్రియుడిని ఆస్పత్రిలో చేర్పించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి ముఖ కవళికలు కూడా మారిపోవడంతో ఆ వ్యక్తిని సుధాకర్‌రెడ్డి అనే అంతా అనుకున్నారు. కానీ.. రెండురోజుల క్రితం సుధాకర్‌రెడ్డి దగ్గరి బంధువు ఒకరు ఆస్పత్రికి వెళ్లి.. చికిత్స పొందుతున్న వ్యక్తితో మాట్లాడినప్పుడు ఆయనకు అనుమానం వచ్చింది. దీంతో ఆయన పోలీసులకు సమాచారం అందించారు.
 
దీంతో పోలీసుల రంగంలోకి దిగి స్వాతిని అదుపులోకి తీసుకుని తమదైనశైలిలో విచారించగా, అసలు విషయం బహిర్గతమైంది. సుధాకర్‌రెడ్డి పేరిట చికిత్స పొందుతున్న రాజేష్‌ వేలిముద్రలు సేకరించడంతో గుట్టురట్టయింది. క్రైం కిల్లర్‌ సినిమాను తలపించే విధంగా ఈ కేసులో ట్విస్ట్‌లు ఉండటంతో పోలీసులు సమగ్ర విచారణ చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments