కుమార్తె సాక్షిగా అమ్మానాన్నకు పెళ్లి...

పదకొండేళ్ళ కుమార్తె తన తల్లిదండ్రులకు మళ్లీ పెళ్లి చేసింది. విజయవాడలో చోటుచేసుకున్న ఈ అరుదైన పెళ్లి వివరాలను పరిశీలిస్తే, విజయవాడకు చెందిన నాగరాణికి, చెన్నైకు చెందిన వెంకట రమణ అనే వ్యక్తితో గత 2006లో

Webdunia
ఆదివారం, 10 డిశెంబరు 2017 (08:16 IST)
పదకొండేళ్ళ కుమార్తె తన తల్లిదండ్రులకు మళ్లీ పెళ్లి చేసింది. విజయవాడలో చోటుచేసుకున్న ఈ అరుదైన పెళ్లి వివరాలను పరిశీలిస్తే, విజయవాడకు చెందిన నాగరాణికి, చెన్నైకు చెందిన వెంకట రమణ అనే వ్యక్తితో గత 2006లో పెళ్లి జరిగింది. ఆ తర్వాత వీరి దాంపత్య జీవితానికి గుర్తుగా 2007లో ఓ కుమార్తె జన్మించింది. 
 
చెన్నైలో కాపురం ఉంటున్న వీరి మధ్య కలహాలు మొదలయ్యాయి. దీంతో నాగరాణి తన కుమార్తెను తీసుకొని విజయవాడలోని తల్లిదండ్రుల వద్దకు వచ్చేసింది. 2011లో విజయవాడ ఫ్యామిలీ కోర్టులో పిటీషన్‌ దాఖలు చేసి, భర్త నుంచి విడాకులు కోరింది. పలు దఫాలుగా కేసును విచారించిన కోర్టు ఈ యేడాది జూలై 20వ తేదీన ఆ భార్యా భర్తలకు విడాకులు మంజూరు చేశారు.
 
ఆ తర్వాత ఆ దంపతుల్లో పునరాలోచన మొదలైంది. పెళ్లి విలువ తెలిసొచ్చింది. తన కుమార్తె పడుతున్న కష్టాలు చూసి చలించిపోయారు. తాము చేసిన తప్పుకు కుమార్తె కష్టపడటాన్ని చూసి తట్టుకోలేక పోయారు. పైగా, తామిద్దరం కూడా అకారణంగా విడిపోయినట్టు గుర్తించారు. దీంతో వారిద్దరూ శుక్రవారం తిరిగి కోర్టును ఆశ్రయించారు. 
 
'మేం మళ్లీ కలిసి జీవిస్తాం' అని ఫ్యామిలీ కోర్టును తెలిపారు. వారిద్దరి నిర్ణయాన్ని స్వాగతించిన న్యాయమూర్తి అచ్యుత పార్థసారథిని 11 యేళ్ల కుమార్తె సాక్షిగా వారిద్దరి మళ్లీ పెళ్లి జరిపించారు. అంటే పూలదండలు మార్పించారు. దీంతో ఆ దంపతుల కథ సుఖాంతమైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

తోట తరణి సృజనాత్మక యువరతరానికి ఆదర్శం : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments