Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేను మగాడినే... ఐతే ఆ నపుంశకుడికి ఆ పరీక్షలు చేయాల్సిందే... ఎవరు?

నా జీవితాన్ని నాశనం చేశాడు. ఇక ఏ యువతికి ఇలాంటి పరిస్థితి రాకూడదు. సర్. రాజేష్‌కు లైంగిక పటుత్వ పరీక్షలు చేయించండి.. వెంటనే హైదరాబాద్‌కు పంపించి పరీక్షలు చేయించేందుకు అనుమతి ఇవ్వండి. ఇది నపుంశకుడు రాజేష్‌ భార్య శైలజ కోర్టుకు వినతి. ఇక్కడ మరో ట్విస్ట్

నేను మగాడినే... ఐతే ఆ నపుంశకుడికి ఆ పరీక్షలు చేయాల్సిందే... ఎవరు?
, శనివారం, 9 డిశెంబరు 2017 (17:51 IST)
నా జీవితాన్ని నాశనం చేశాడు. ఇక ఏ యువతికి ఇలాంటి పరిస్థితి రాకూడదు. సర్. రాజేష్‌కు లైంగిక పటుత్వ పరీక్షలు చేయించండి.. వెంటనే హైదరాబాద్‌కు పంపించి పరీక్షలు చేయించేందుకు అనుమతి ఇవ్వండి. ఇది నపుంశకుడు రాజేష్‌ భార్య శైలజ కోర్టుకు వినతి. ఇక్కడ మరో ట్విస్ట్ ఏమిటంటే తాను మగాడినేనని రాజేష్‌ కోర్టుకు వెళ్ళి తనకు పరీక్షలు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేసుకున్నాడు. ఆ పిటిషన్‌కు పోటీగా మరో పిటిషన్‌ను శైలజ వేయడమే.
 
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలంలో గత నెల 30వ తేదీన రాజేష్‌, శైలజ వివాహం జరిగింది. శోభనం రోజు రాత్రి రాజేష్‌ నపుంశకుడని తెలుసుకున్న శైలజ ఒక్కసారిగా శోభనం గది నుంచి బయటకు వచ్చి బంధువులకు విషయాన్ని తెలిపింది. అయితే బంధువులు వాటిని పట్టించుకోకుండా మళ్ళీ శోభనం గదిలోకి నెట్టారు. తాను నపుంశకుడన్న విషయం బంధువులకు చెబుతావా అంటూ శైలజను తీవ్రంగా గాయపరిచాడు రాజేష్‌. మహిళా సంఘాల డిమాండ్‌తో పోలీసులు రాజేష్‌‌ను అదుపులోకి తీసుకున్నారు. 
 
ప్రస్తుతం రిమాండ్‌లో రాజేష్‌ ఉండగా ఒక పిటిషన్‌ను పెట్టుకున్నాడు. తాను మగాడినే.. నపుంశకుడిని కాదు. తనను పరీక్షించండి అంటూ తన తండ్రి ద్వారా పిటిషన్ పెట్టుకున్నాడు రాజేష్‌. ఇది తెలుసుకున్న శైలజ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే ఆమె కూడా మరో పిటిషన్‌ను దాఖలు చేసింది. వెంటనే రాజేష్‌‌కు లైంగిక పటుత్వ పరీక్షలు జరపాలని న్యాయమూర్తిని కోరింది. అంతా విన్న న్యాయమూర్తి సోమవారం తీర్పును వెల్లడించనున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మోదీజీ... మీరు ప్రత్యేక హోదా ఇవ్వనప్పుడు మా ఆధార్ మీకెందుకివ్వాలి? పవన్ ప్రశ్న