Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తన గుట్టు బయటపెట్టిందనీ నరరూప రాక్షసుడయ్యాడు...

ఉదయం వివాహం చేసుకున్న భార్యకు అదే రోజు రాత్రి జరిగిన శోభనంలో చిత్రహింసలు పెట్టిన నరరూప రాక్షసుడిని చిత్తూరు జిల్లా పోలీసులు తమదైనశైలిలో విచారిస్తున్నారు.

Advertiesment
తన గుట్టు బయటపెట్టిందనీ నరరూప రాక్షసుడయ్యాడు...
, ఆదివారం, 3 డిశెంబరు 2017 (11:24 IST)
ఉదయం వివాహం చేసుకున్న భార్యకు అదే రోజు రాత్రి జరిగిన శోభనంలో చిత్రహింసలు పెట్టిన నరరూప రాక్షసుడిని చిత్తూరు జిల్లా పోలీసులు తమదైనశైలిలో విచారిస్తున్నారు. ఈ విచారణలో కట్టుకున్న భార్య శైలజపై అంతదారుణానికి పాల్పడటానికిగల కారణాలను భర్త రాజేష్ వెల్లడించాడు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో జరిగిన ఈ దారుణం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. 
 
విచారణలో రాజేష్ వెల్లడించిన వివరాలపై పోలీసులు స్పందిస్తూ, ప్రభుత్వ పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్‌గా పని చేస్తున్న రాజేష్ నిజానికి దాంపత్య జీవితానికి పనికిరాడు. అంటే ఓ నపుంసకుడు. ఈ విషయాన్ని దాచిపెట్టి శైలజను పెళ్లి చేసుకున్నాడు. కట్నకానుకల కింద సుమారు కోటి రూపాయలు నొక్కేశాడు. అయితే, శోభనం రోజున తన గుట్టును భార్యకు చెప్పాడు. పైగా, ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని బతిమాలాడు. 
 
తన భర్త ఓ నపుంసకుడని తెలియడంతో ఆ వధువు నిశ్చేష్టురాలైంది. తన జీవితం నాశనం అయిపోయిందని లోలోపల కుమిలిపోయింది. ఆ బాధను దిగమింగుకోలేని శైలజ... బయటకు వచ్చి తన భర్త గురించి తెలిసిన నిజాన్ని నలుగురికీ చెప్పింది. ఆపై "సరదాగా అన్నానులే" అంటూ రాజేష్ బుకాయించగా తిరిగి గదిలోకి శైలజను పంపారు. 
 
కానీ, తన రహస్యాన్ని నలుగురికీ చెప్పిందన్న ఆగ్రహం రాజేష్‌ను నరరూప రాక్షసుడిని చేసింది. కేకలు పెట్టకుండా నోటిలో బట్టలు కుక్కి పిడిగుద్దలు గుద్దాడు. తలపై మోదాడు. ఇష్టమొచ్చిన చోటల్లా కొరికాడు. తీవ్ర గాయాల పాలైన శైలజ, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, రాజేష్ పోలీసుల అదుపులో ఉన్నాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాద్‌లో మెట్రో జోష్... ప్రయాణికులతో స్టేషన్లు కిటకిట