రేపటి సిఎం కేసీఆర్ కరీంనగర్ పర్యటన వాయిదా

Webdunia
శుక్రవారం, 20 మార్చి 2020 (22:44 IST)
దేశ వ్యాప్తంగా ప్రబలుతున్న కరోనా వైరస్‌ను అరికట్టడంలో ముందంజలో వున్న రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పటికే అప్రమత్తమై కరోనాను ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజలల్లో మరింత భరోసాను నింపేందుకు స్వయంగా ముఖ్యమంత్రి కెసిఆర్ కరీంనగర్ పర్యటనకు పూనుకున్నారు. 
 
కాగా.. ప్రస్తుత పరిస్థితుల్లో సిఎం పర్యటన వల్ల అక్కడ భారీ స్థాయిలో జరుగుతున్న స్క్రీనింగ్, వైద్య ఏర్పాట్లకు అసౌకర్యం కలగకుండా వుండాలని, కరీంనగర్ జిల్లా యంత్రాంగం, వైద్యశాఖ ఉన్నతాధికారులు, రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి తదితరుల సూచనల మేరకు.. శనివారం సిఎం తలపెట్టిన కరీంనగర్ పర్యటన వాయిదా పడింది.
 
ఇప్పటికే.. శుక్రవారం నాడు ముఖ్యమంత్రి రాష్ట్రంలో కరోనా పరిస్థితి సహా కరీంనగర్‌లో జరుగుతున్న వైద్య ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ పోలీస్ కమీషనర్లతో ఎప్పటికప్పుడు పలుమార్లు ఆరా తీసారు. వారు కూడా కరీంనగర్‌లో జరుగుతున్న ఏర్పాట్ల విషయంలో సిఎం కు భరోసానివ్వడమే కాకుండా పర్యటనను వాయిదా వేసుకోవాలని కోరడంతో.. సిఎం పర్యటన వాయిదా పడింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో సంక్రాంతి సందడి... కొత్త సినిమా పోస్టర్లు రిలీజ్

జన నాయగన్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు - హైకోర్టులోనే తేల్చుకోండి..

ఏనుగుల వేట ప్రేరణ తో కటాలన్ - ఆంటోనీ వర్గీస్‌ను ఫస్ట్ లుక్‌

ఆకాష్ - భైరవి అర్థ్యా జంటగా కొత్త మలుపు లుక్

పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కలయికలో చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ నూతన సంవత్సరంలో సాధారణ అలవాట్ల కోసం పెద్ద తీర్మానాలను చేసుకున్న అనన్య పాండే

సరే, మీరు పిల్లల్ని పంపడంలేదుగా, మే జారుతాం: జర్రున జారుతున్న కోతులు (video)

అద్భుతమైన కళాత్మక వస్త్రశ్రేణితో ఈ సంక్రాంతి సంబరాలను జరుపుకోండి

దక్షిణ భారతదేశంలో విస్తరిస్తున్న గో కలర్స్, హైదరాబాద్‌ ఏఎస్ రావు నగర్‌లో కొత్త స్టోర్ ప్రారంభం

ఏ ఆహారం తింటే ఎముకలు పటిష్టంగా మారుతాయి?

తర్వాతి కథనం
Show comments