Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణా నిరుద్యోగుల కోసం రేపు ష‌ర్మిల నిరాహార దీక్ష‌...!

Webdunia
సోమవారం, 19 జులై 2021 (15:15 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో నిరుద్యోగుల నిర‌స‌న‌లు న‌డుస్తుండ‌గా, రేపు తెలంగాణాలో నిరుద్యోగుల కోసం వై.ఎస్.ఆర్.టి.పి. నేత ష‌ర్మిల నిరాహార దీక్ష చేయ‌నున్నారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని గంగదేవిపాడులో ఈ నెల 20న వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టనున్నారు. ఆ పార్టీ రాష్ట్ర నేత కొండా రాఘవరెడ్డి ఈ వివరాలు వెల్లడించారు.
 
రేపు ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు షర్మిల దీక్ష కొనసాగిస్తారని, తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి 10 జిల్లాల నుంచి నిరుద్యోగులు, విద్యార్థులు, యువకులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై మద్దతు తెలపాలని కోరారు. మ‌రో ప‌క్క ఆంధ్ర‌లో ష‌ర్మిల అన్న సీఎం వై.ఎస్. జ‌గ‌న్ వెల‌వ‌రించిన జాబ్ క్యాలండ్ పైన ఇక్క‌డ తీవ్ర నిర‌స‌న‌లు వ్య‌క్తం అవుతున్నాయి.
 
నిరుద్యోగ యువ‌కులు ప్ర‌తిప‌క్షాల ఆధ్వ‌ర్యంలో సీఎం జ‌గ‌న్ ఇంటిని ముట్ట‌డించాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు. దీనితో పోలీసులు చాలా మంది యువ‌కుల‌ను అరెస్టు కూడా చేశారు. ఇలాంటి త‌రుణంలో తెలంగాణాలో ష‌ర్మిల నిరుద్యోగుల త‌ర‌ఫున నిరాహార దీక్ష చేయ‌డం రాజ‌కీయ దుమారాన్ని రేపుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments