నాలుగేళ్ళ చిన్నారిపై అత్యాచారం - ముద్దాయికి 20 యేళ్ళ జైలు

Webdunia
మంగళవారం, 24 ఆగస్టు 2021 (10:15 IST)
తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నాలుగేళ్ళ చిన్నారిపై లైంగికదాడికి తెగబడిన ముద్దాయికి 20 యేళ్ల జైలుశిక్ష విధిస్తూ స్థానిక కోర్టు తీర్పునిచ్చింది. చాక్లెట్లు కొనుక్కునేందుకు దుకాణానికి వచ్చిన చిన్నారిపై ఆ కామాంధుడు అత్యంత పాశవికంగా అత్యాచారం చేశాడు. ఈ కేసును విచారించిన ఖమ్మం జిల్లా కోర్టు... ముద్దాయికి 20 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.
 
ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన పింగళి గణేశ్ అలియాస్ చింటూ (20)కి కిరాణా దుకాణం ఉంది. గతేడాది నవంబరు 19న చాక్లెట్ కొనుక్కునేందుకు నాలుగేళ్ళ చిన్నారి దుకాణం వద్దకు వచ్చింది. ఆ చిన్నారని చింటూ ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం జరిపాడు. 
 
అనంతరం ఏడుస్తూ ఇంటికి చేరుకున్న బాలికను చూసిన తల్లిదండ్రులు విషయం ఆరా తీయగా చిన్నారి చెప్పింది విని విస్తుపోయారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. 
 
సోమవారం ఈ కేసు తుది విచారణకు రాగా, ఖమ్మం మొదటి అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి పి.చంద్రశేఖరప్రసాద్ నిందితుడు గణేశ్‌ను దోషిగా తేల్చి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raai Lakshmi :సెక్సువల్‌ హరాస్‌మెంట్‌కు పోరాడిన మహిళ గా రాయ్‌ లక్ష్మీ

Chiranjeevi : అనిల్ రావిపూడి కి షూటింగ్ లో షాక్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ?

మేఘన కు నా పర్సనల్ లైఫ్ కు చాలా పోలికలు ఉన్నాయి : రాశీ సింగ్

Balakrishna: ఇదంతా ప్రకృతి శివుని ఆజ్ఞ. అఖండ పాన్ ఇండియా సినిమా : బాలకృష్ణ

ఆదిత్య 999 మ్యాక్స్‌లో మోక్షజ్ఞ.. బాలయ్య కూడా నటిస్తారట.. ఫ్యాన్స్ ఖుషీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం