Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇద్దరు పిల్లల తండ్రి, మైనర్ పైన మనస్సు పడ్డాడు, లాడ్జికెళ్ళి అది తాగేసారు

Advertiesment
ఇద్దరు పిల్లల తండ్రి, మైనర్ పైన మనస్సు పడ్డాడు, లాడ్జికెళ్ళి అది తాగేసారు
, సోమవారం, 23 ఆగస్టు 2021 (17:38 IST)
అతనికి పెళ్ళయి ఇద్దరు పిల్లలున్నారు. సాఫీగా సాగిపోతున్న కుటుంబం. 37 సంవత్సరాల వయస్సు. అయితే అతను ఒక మైనర్ బాలికపై మనస్సు పడ్డాడు. ఆమె కూడా అతనికి దగ్గరైంది. తనకు పెళ్ళయ్యింది.. పిల్లలున్నారు.. మైనర్ బాలికతో కలవడం అవసరమా అని అతను ప్రశ్నించుకోలేదు. మైనర్ బాలికతో సహజీవనం ప్రారంభించాడు. చివరకు లాడ్జికి తీసుకెళ్ళి ఇద్దరు కలిసి పురుగుల మందు తాగారు. ఎందుకంటే?
 
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళ్యెం ప్రాంతానికి చెందిన రమణయ్యకు వివాహమైంది. స్థానికంగా ఇంటికి సమీపంలో ఉన్న ఒక మైనర్ బాలిక తన ఇంటికి తరచూ వచ్చి వెళుతూ ఉండేది. రమణయ్య భార్యతో ఆ మైనర్ బాలిక మాట్లాడుతూ ఉండేది. అయితే ఆ బాలికపై కన్నేశాడు రమణయ్య.
 
రెండు నెలల నుంచి ఆమెతో సహజీవనం రహస్యంగా చేస్తున్నాడు. ఆమెకు మాయమాటలు చేసి లోబరుచుకున్నాడు. విషయం ఎక్కడా బయటకు రాకుండా జాగ్రత్త పడ్డాడు. నువ్వు లేకుంటే నేను చచ్చిపోతాను..నన్ను రెండవ పెళ్ళి చేసుకో..మన పెళ్ళి అయిన తరువాత నా తల్లిదండ్రులకు చెబుతాను.
 
పెళ్ళయిన తరువాత వారు చచ్చినట్లు ఒప్పుకుంటారని ఆ మైనర్ బాలిక చెప్పింది. అయితే పెళ్ళి మాట చెబితే తప్పించుకునే తిరిగే రమణయ్య ఆమెను ఎలాగైనా చంపేయాలని ప్లాన్ చేశాడు. నెల్లూరులోని ఒక లాడ్జికి నిన్న మధ్యాహ్నం తీసుకెళ్ళాడు. పురుగుల మందు కలిపిన కూల్ డ్రింక్ ఆమెకు తాగించాడు.
 
ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోగా భయంతో రమణయ్య కూడా పురుగుల మందును తాగేశాడు. ఇద్దరూ అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోవడంతో లాడ్జి నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల సమాచారంతో లాడ్జి నిర్వాహకులు ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైవేమీద మహీంద్ర ఎస్‌యూవీ ఒక్కటే టైగర్‌ కాదు.. ఆనంద్ మహీంద్రా