Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జైలు శిక్ష నుంచి దానం నాగేందర్‌కు ఊరట : హైకోర్టు ఆదేశం

జైలు శిక్ష నుంచి దానం నాగేందర్‌కు ఊరట : హైకోర్టు ఆదేశం
, గురువారం, 29 జులై 2021 (10:08 IST)
తెలంగాణ ప్రాంతానికి చెందిన సీనియర్ తెరాస నేత, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు ఆ రాష్ట్ర హైకోర్టు ఊరట కల్పించింది. ఎస్.సాంబశివరావు అనే వ్యక్తిపై దాడి చేసి, బెదిరించిన అభియోగాలపై 2013లో దానంపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. 
 
ఈ కేసులో ఈ నెల 7న విచారణ జరిపిన నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు దానంను దోషిగా తేల్చి ఆరు నెలల జైలు శిక్షతోపాటు వెయ్యి రూపాయల జరిమానా విధించింది. ఈ తీర్పును నాగేందర్ హైకోర్టులో సవాల్ చేశారు. 
 
దీనిని విచారించిన జస్టిస్ జి.శ్రీదేవి దానంపై విధించిన ఆరు నెలల జైలు శిక్ష అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. బెయిలుకు సంబంధించి కింది కోర్టు విధించిన షరతులే వర్తిస్తాయని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో దానం నాగేందర్ ఊపరి పీల్చుకున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాము కరిచింది.. కానీ బెదరలేదు.. ఆ ఏడేళ్ల బుడ్డోడు ఏం చేశాడంటే..?