Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తుదిశ్వాస విడిచేంత వరకు కారులోనే ఉంటా : దానం నాగేందర్

Advertiesment
తుదిశ్వాస విడిచేంత వరకు కారులోనే ఉంటా : దానం నాగేందర్
, శుక్రవారం, 2 జులై 2021 (16:35 IST)
హైదరాబాద్ నగరానికి చెందిన తెరాస సీనియర్ నేత దానం నాగేందర్ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. వీటిపై ఆయన శుక్రవారం స్పందించారు. తాను తన తుది శ్వాస విడిచేంతవరకు టీఆర్ఎస్ పార్టీలోనే కొన‌సాగుతాన‌ని స్ప‌ష్టం చేశారు. కేసీఆర్ నాయ‌క‌త్వంలో క‌ష్ట‌ప‌డి ప‌ని చేస్తాను అని ఆయ‌న తేల్చిచెప్పారు. 
 
అదేసమయంలో తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న‌ట్లు వ‌స్తున్న వార్త‌లు అవాస్త‌వ‌మ‌న్నారు. కాంగ్రెస్ పార్టీ నాయ‌కులే టీఆర్ఎస్ పార్టీలో చేరి గౌర‌వం కాపాడుకోవాల‌న్నారు. అభివృద్ధిలో భాగ‌స్వాములు కావాల‌న్నారు. టీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదు. ఈ పార్టీకి ధీటుగా పుట్టేవాడే లేడు.. పుట్టబోడు అని దానం నాగేంద‌ర్ పేర్కొన్నారు.
 
మరోవైపు, తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న‌ట్లు త‌ప్పుడు క‌థ‌నాల‌ను ప్ర‌చురించిన దిశ వెబ్‌సైట్‌, ఆర్‌బీసీ యూట్యూబ్ ఛానెల్‌పై హైద‌రాబాద్ సీపీకి దానం నాగేంద‌ర్ ఫిర్యాదు చేశారు. త‌ప్పుడు క‌థ‌నాలు ప్ర‌సారం చేసిన ఈ రెండింటిపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న కోరారు. 
 
అంతేకాకుండా, తెలంగాణ కొత్త పీసీసీ సారథి రేవంత్ రెడ్డి మాటలకు మూతి, తోక ఏది ఉండదని విమర్శించారు. ఇక గుంజుకునుడే అంటున్నాడని.. ఇక్కడ గుంజుకోవడానికి ఎవడబ్బ సొమ్ము కాదన్నారు. 'ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కనిపించడం లేదా? నా మీద జరుగుతున్న దుష్ప్రచారంపై పోలీసులకు ఫిర్యాదు చేశాను. క్రిమినల్ కేసులు పెట్టాలని కోరాను. నా ప్రాణం ఉన్నంత వరకు టీఆర్ఎస్‌లోనే ఉంటా. కాంగ్రెస్‌లోకి వెళ్లడానికి ఆ పార్టీలో ఏముంది? కాంగ్రెస్‌లో ఓ వర్గం నన్ను హ్యుమిలేట్ చేస్తేనే బయటకు వచ్చాను' అని దానం నాగేందర్ ఆరోపించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సెప్టెంబరులో థర్డ్‌ వేవ్‌... తీవ్ర‌త త‌క్కువే! : డాక్ట‌ర్ నాగేశ్వ‌ర‌రెడ్డి