Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఈ ఒక్క ఫోటో చాలు.. ఈ చిన్నారి ఫోటో చూడకపోతే..?: రేవంత్ రెడ్డి

Advertiesment
ఈ ఒక్క ఫోటో చాలు.. ఈ చిన్నారి ఫోటో చూడకపోతే..?: రేవంత్ రెడ్డి
, గురువారం, 1 జులై 2021 (23:12 IST)
revanth reddy
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి రాజకీయాల్లో దూకుడుగా ముందుకు సాగుతున్నారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎంపికయ్యాక.. మరో వారంలో బాధ్యతలు చేపట్టబోతున్నారు. కేడర్‌లో, లీడర్లలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. ఈ సమయంలో రేవంత్ రెడ్డికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. 
 
ఒక ఫోటో ఎన్నో పదాల కంటే ఎక్కువగా మాట్లాడుతుందంటూ కారుపై తన బొమ్మను ఓ చిన్నారి ముద్దాడుతున్న ఫోటోను షేర్ చేశారు రేవంత్ రెడ్డి. ఈరోజు కూడా ప్రతి రోజులాగే ఉండేది, ఈ అందమైన చిన్నారి ఫోటో చూడకపోతే అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇక పలువురు నాయకులను వరుసగా కలుస్తూ వస్తున్న టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డికి తాజాగా మాజీ మంత్రి, తెలంగాణ నాయకులు నాగం జనార్థన్ రెడ్డి అభినందనలు తెలిపారు. దీనికి సంబంధించిన ఫోటోను కూడా రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో పంచుకున్నారు.
 
ఇక జూలై 7వ తేదీ మధ్యాహ్నం 1:30 గంటలకు తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోనున్నట్లు ఇప్పటికే టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో తాను పాదయాత్ర చేసే అవకాశం ఉందని, అదెప్పుడన్నది పార్టీ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. పార్టీ అధ్యక్షుడిగా వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోబోనని, సమష్టి నిర్ణయాలే ఉంటాయన్నారు. కార్యకర్తలకు తాను అండగా ఉంటానని, కార్యకర్తలకు కష్టం రాకుండా చూసుకుంటానని ఇప్పటికే వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చెల్లెమ్మకు స్మార్ట్ ఫోన్ తీసిచ్చాడు.. వీడియోలు చూస్తుందని చంపేశాడు..