భారత జాతిపిత మహాత్మా గాంధీ మనవరాలికి ఏడేళ్ళ జైలుశిక్ష పడింది. ఓ ఫోర్జరీ కేసులో ఆమెకు సౌతాఫ్రికా కోర్టు ఏడేళ్ళ పాటు జైలుశిక్షను విధిస్తూ తీర్పునిచ్చింది. 53 యేళ్ళ అశీష్ లతా రాంగోబిన్.. గాంధీ మునిమనవరాలు. సౌతాఫ్రికాలో ఉంటున్నారు.
ఈమె ఓ ఫోర్జరీ కేసులో రూ.3.23 కోట్ల మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ఆమె దోషిగా తేలింది. ఫలితంగా డర్బన్ కోర్టు ఆమెకు ఏడేళ్ల జైలుశిక్ష విధిస్తూ సోమవారం కోర్టు తీర్పునిచ్చింది.
ప్రముఖ వ్యాపారవేత్త నుంచి ఎస్ఆర్ మహరాజ్‌ను మోసం చేసినట్లు తెలిపింది. ఆమె కోసం భారత్ నుంచి వచ్చే ఓ కన్‌సైన్‌మెంట్ కోసం, ఇంపోర్ట్ అండ్ కస్టమ్స్ డ్యూటీస్ చెల్లించేందుకు మహరాజ్... ఆమెకు అడ్వాన్స్‌గా రూ.3.23 కోట్లు (62 లక్షల ర్యాండ్లు) ఇచ్చాడు.
ఆ కన్‌సైన్‌మెంట్ ద్వారా వచ్చే లాభాల్లో కొంత ఆయనకు లభిస్తుంది. అయితే, అసలా కన్‌సైన్‌మెంటే లేదనీ.... అలా అడ్డగోలు నకిలీ బిల్లులు సృష్టించి... ఆమె ఆయన్ని మోసం చేశారని తేలింది.
ప్రముఖ హక్కుల పోరాట యోధురాలు ఎలా గాంధీ, దివంగత మేవా రామ్‌గోబింద్‌ల కూతురే ఆశిష్ లతా రాంగోబిన్. ఈ కేసు విచారణ 2015లోనే ప్రారంభమైంది. ఆమె మోసపూరిత చర్యలో భాగంగా... లేని కన్‌సైన్‌మెంట్ ఉన్నట్లుగా చూపించేందుకు నకిలీ ఇన్వాయిస్‌లు, డాక్యుమెంట్లు సృష్టించారని తెలిసింది.