నీట మునిగిన సిరిసిల్ల : మంత్రి కేటీఆర్ టెలీకాన్ఫరెన్స్

Webdunia
మంగళవారం, 7 సెప్టెంబరు 2021 (11:27 IST)
తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్ల పట్టణం నీటమునిగింది. మంగళవారం రాత్రి భారీ వ‌ర్షం కురియ‌డంతో వ‌ర‌ద నీరు పోటెత్తింది. దీంతో ప‌లు కాల‌నీల్లో వ‌ర‌ద నీరు వ‌చ్చి చేరింది. అనేక వీధుల్లో నడంలోతు నీళ్లు వచ్చి నిలిచివున్నాయి. ఈ నీటిలో కార్లు మునిగిపోయివున్నాయి. 
 
ఈ విషయం తెలుసుకున్న మంత్రి కేటీఆర్ జిల్లా కలెక్టర్, ఎస్పీ, మున్సిపల్ కమిషనర్‌ల‌తో టెలీకాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. గ‌త మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో సిరిసిల్ల పట్టణానికి వరద నీరు వచ్చి కాలనీల్లో చేరుతున్న దృష్ట్యా సహాయక చర్యలు ముమ్మరం చేయాలని జిల్లా యంత్రాగాన్ని మంత్రి కేటీఆర్ ఆదేశించారు.
 
వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. వరద ముంపున‌కు గురైన ప్రజలను పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి తరలించాలని సూచించారు. 
 
సహాయక చర్యల కోసం హైద‌రాబాద్‌ నుంచి డీఆర్ఎఫ్ బృందాన్ని పంపిస్తున్నామని తెలిపారు. ప్రజలెవ‌రూ ఆందోళన చెందవద్దని, అన్ని విధాలుగా సహాయక చర్యలు చేపట్టేందుకు అధికార యంత్రంగం సిద్ధంగా ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhil: దీపావళి శుభాకాంక్షలతో అక్కినేని అఖిల్, జైనాబ్ రవ్జీ

James Cameron : జేమ్స్ కామెరూన్.. అవతార్: ఫైర్ అండ్ యాష్.. కోసం భారతదేశంలో ఈవెంట్

Rishabh Shetty: ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్‌తో విడుదలౌతున్న కాంతార: చాప్టర్ 1

Prabhas: ఒంటరిగా నడిచే బెటాలియన్ - 1932 నుండి మోస్ట్ వాంటెడ్ గా ప్రభాస్

Raj Dasireddy : యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్న రాజ్ దాసిరెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

తర్వాతి కథనం
Show comments