హైదరాబాద్‌లో రెడ్ అలెర్ట్ విధించారు. హైదరాబాద్‌లో సోమవారంతో కలిపి మొత్తం మూడు రోజులు రెడ్ అలర్ట్ విధించినట్లు వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న తెలిపారు. రాష్ట్రంలో రుతుపవనాలు. దట్టంగా అలుముకున్న క్యూములో నింబస్ మేఘాలు చురుగ్గా కదులుతున్నాయి. అలాగే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని వెల్లడించారు.
కాబట్టి ఆ అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలుచోట్ల ఇవాళ, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అందుకే గ్రేటర్ హైదరాబాద్ తో పాటుగా 16 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. అధికారులు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ శాఖ సూచించింది. అయితే ప్రస్తుతం మూసీ పరీవాహక ప్రాంతాల్లో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు తెలిపారు.