Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్షం కోసం బాలికలను నగ్నంగా ఊరేగించారు.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 7 సెప్టెంబరు 2021 (11:23 IST)
వర్షపు చినుకుపడకుంటే వరుణ దేవుడి అనుగ్రహం కోసం వివిధ రకాల పూజలు చేస్తుంటారు. ఈ పూజలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉంటాయి. ఇపుడు వర్షం కోసం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బాలికలను నగ్నంగా ఊరేగించారు. వారితో భుజా‌లపై కాడిని మోయిస్తూ, దానికి చివర కప్ప‌లను కట్టి ఊరే‌గిం‌చారు. వారి వెనుక గ్రామా‌నికి చెందిన మహి‌ళలు నడుస్తూ వరుణ దేవుడి పాటలు పాడుతూ నడి‌చారు.
 
ఈ ఘటన రాష్ట్రంలోని దమోహ్‌ జిల్లా‌లోని బనియా అనే గ్రామంలో ఆది‌వారం జరిగింది. దీని వెనుక ఆ బాలి‌కల తల్లి‌దం‌డ్రుల ప్రమేయం కూడా ఉందని కొందరు గ్రామస్థులు అంటున్నారు. బుందే‌ల్‌‌ఖండ్‌ ప్రాంతంలో ఉన్న ఈ గ్రామంలో వర్షాలు లేక కరువు ముసు‌రు‌కుం‌టున్న వేళ గ్రామ‌స్తులు మూఢ‌న‌మ్మ‌కాన్ని ఆశ్ర‌యిం‌చా‌రని చెబు‌తు‌న్నారు. 
 
ఐదేం‌డ్ల‌లోపు బాలి‌కలు ఆరు‌గురు ఒకరి పక్కన ఒకరు దుస్తులు లేకుండా నడు‌స్తున్న వీడియో ఒకటి బయ‌ట‌కు‌వ‌చ్చింది. ఈ ఘట‌నపై నివే‌దిక సమ‌ర్పిం‌చా‌లని జిల్లా యంత్రాం‌గాన్ని జాతీయ బాలల హక్కుల పరి‌ర‌క్షణ కమి‌షన్‌ ఆదే‌శిం‌చింది. అలాగే, ఆ గ్రామానికి వెళ్లిన పోలీసులు, స్థానిక అధికారులు విచారణ చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం