Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోడికూర వండి పొలానికి తీసుకెళ్లలేదనీ భార్యను కొట్టి చంపేసిన కసాయి భర్త!

Webdunia
బుధవారం, 28 అక్టోబరు 2020 (12:12 IST)
కొంతమంది పురుషులు తమలోని కర్కశత్వాన్ని ఏమాత్రం అదుపు చేసుకోలేరు. ఆవేశాన్ని అదుపు చేసుకోలేక జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేస్తుంటారు. తాజాగా కట్టుకున్న భార్య కోడికూర వండి పొలానికి తీసుకుని రాలేదన్న కోపంతో కట్టుకున్న భర్త కసాయిగా మారిపోయాడు. ఇంటికి వచ్చిన భర్త.. కర్రతో చికతబాదాడు. ఈ దెబ్బళు తాళలేని ఆమె... అక్కడే ప్రాణాలు విడిచింది. ఈ విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రంలోని నాగర్‌కర్నూలు జిల్లా క్యాంపు రాయవరంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, క్యాంపు రాయవరం గ్రామానికి చెందిన నిమ్మల సన్నయ్య, సీతమ్మ (38) అనే దంపతులు ఉన్నారు. సోమవారం ఇంటికి కోడిమాంసం తీసుకొచ్చిన సన్నయ్య భార్యకు ఇచ్చి వండి పొలానికి తీసుకురావాలని చెప్పి వెళ్లిపోయాడు. అయితే, దానిని పక్కనపెట్టి కాయగూరలతో వండిన కూరను తీసుకెళ్లింది.
 
అది చూసిన సన్నయ్య ఆగ్రహంతో ఊగిపోయాడు. కర్రతో భార్యను చితకబాదాడు. దెబ్బలకు తట్టుకోలేని ఆమె స్పృహతప్పి కిందపడిపోయింది. దీంతో భార్యను గుట్టుచప్పుడు కాకుండా ఇంటికి తీసుకొచ్చి లోపల ఆమెను ఉంచి తాళం వేసి పరారయ్యాడు. 
 
గొడవ విషయం తెలిసిన ఇరుగుపొరుగు వారు అనుమానంతో తాళం బద్దలుగొట్టి చూడగా, లోపల సీతమ్మ మృతి చెంది కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న భర్త కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments