Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సర్, వదినే వెళ్ళి బెడ్ మీద పడుకోమని చెబుతుంది, కన్నీళ్ళు పెట్టుకున్న అధికారి

Advertiesment
సర్, వదినే వెళ్ళి బెడ్ మీద పడుకోమని చెబుతుంది, కన్నీళ్ళు పెట్టుకున్న అధికారి
, మంగళవారం, 27 అక్టోబరు 2020 (16:50 IST)
ఆ యువతి పదవ తరగతి చదువుతోంది. తల్లిదండ్రుల మధ్య గొడవల కారణంగా సోదరుడి ఇంట్లో ఉంటోంది. ఆ యువతిని కన్నతల్లిలా కంటికి రెప్పలా కాపాడాల్సిన వదిన వ్యభిచారం చేయించింది. ఏం జరుగుతుందో తెలియని వయస్సులో ఆ యువతి పడిన కష్టం అంతా ఇంతా కాదు. 
 
ప్రకాశంజిల్లా కొండపి మండలం సాయిబాబానగర్‌కు చెందిన ఒక యువతి తన అన్న రవితేజ, వదిన జ్యోతితో కలిసి ఉంటోంది. యువతి తల్లిదండ్రులు తరచూ గొడవ పడుతుండటంతో ఆమె తన అన్న ఇంటికి వచ్చేసింది. లాక్ డౌన్ సమయంలోను ఇంట్లోనే గడిపింది.
 
కానీ లాక్ డౌన్లో ఆమెకు నరకం చూపించింది వదిన జ్యోతి. సులువుగా డబ్బులు సంపాదించాలన్న ఆశ జ్యోతిలో కలిగింది. దీంతో తన స్నేహితురాలి సాయంతో కొంతమంది విటులను మాట్లాడుకుంది. స్నేహితురాలి ఇంటినే వ్యభిచార గృహంలా మార్చేసింది.
 
యువతి అన్న రవితేజ బయటకు వెళ్ళడంతోనే ఆ యువతిని వ్యభిచార గృహానికి తీసుకువచ్చేది. బలవంతంగా ఇద్దరు విటుల వద్ద రేప్ చేయించి వీడియోను తీయించింది. అంతటితో ఆగలేదు, మీ అన్నకు విషయం చెబితే ఈ వీడియోలు ఇంటర్నెట్లో పెట్టేస్తాను.. నిన్ను చంపేస్తానని బెదిరించింది.
 
దీంతో ఆ యువతి కన్నీళ్ళను దిగమింగుకుంది. అంతే, అప్పటి నుంచి ఆరు నెలల పాటు వారానికి ఒకసారి వ్యభిచార గృహానికి తీసుకెళ్ళడం డబ్బులు సంపాదించడమే పనిగా పెట్టుకుంది జ్యోతి. ఇంట్లో తల్లిదండ్రులు సహకరించకపోవడంతో ఆ యువతి వదిన పెట్టే టార్చర్‌ను తట్టుకుంది. కానీ రెండురోజుల క్రితం జరిగిన విషయాన్ని పండక్కి ఇంటికి వెళ్ళిన యువతి తల్లిదండ్రులకు చెప్పేసింది. విషయం పోలీసుల దృష్టికి తీసుకుని వెళ్లడంతో ఆ యువతిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 
 
యువతిని విచారించిన అధికారి ఏం జరిగిందమ్మా అని అడిగితే మా వదినే ఒక ఇంటికి తీసుకెళుతుంది. అక్కడికి వెళ్ళి బెడ్ మీద పడుకోమంటుందని దీనంగా చెప్పింది. దీంతో అధికారికి కన్నీళ్ళు ఆగలేదట. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రైతు భరోసా కింద రూ.1114 కోట్లు బదిలీ... మీ బిడ్డగా చెప్తున్నా.. సీఎం జగన్