Webdunia - Bharat's app for daily news and videos

Install App

తగ్గినట్టే తగ్గి పెరుగుతున్నాయ్.. ఒక్కరోజే 4లక్షల పాజిటివ్ కేసులు

Webdunia
బుధవారం, 28 అక్టోబరు 2020 (11:59 IST)
కరోనా కేసులు మళ్ళీ ప్రపంచానికి సవాల్ విసురుతున్నాయి. తగ్గినట్టే తగ్గి తిరిగి పెరిగిపోతున్నాయి. అక్టోబర్ 21 నుంచి ప్రతి రోజు నాలుగు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా యూరప్ దేశాల్లో కరోనా కేసులు తిరిగి విజృంభిస్తుండటంతో ఆయా దేశాలు అప్రమత్తం అయ్యాయి. ఇప్పటికే అనేక దేశాల్లో రాత్రి సమయంలో కర్ఫ్యూ విధించారు. అవసరమైతే తిరిగి లాక్ డౌన్ విధించేందుకు సైతం సిద్ధం అంటున్నాయి ఆయా దేశాలు. 
 
లాక్ డౌన్ విషయంలో ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్నా, అవసరమైతే తప్పదని ఆయా దేశాలు ప్రకటిస్తున్నాయి అంటే అర్ధం చేసుకోవచ్చు. నిన్న ఒక్కరోజు ప్రపంచవ్యాప్తంగా 4,47,349 కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రపంచంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,42,23,262కి చేరింది. 
 
మంగళవారం ఒక్కరోజు కరోనాతో 6907 మంది మరణించగా, మొత్తం మరణాల సంఖ్య 11,71,155కి చేరింది. కరోనా వచ్చి వెళ్లిన వారిలో దీర్ఘకాలిక రోగాలు బయటపడుతున్నాయని, జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుస ఫ్లాప్‌లు... అయినా ఛాన్సులు.. 'డ్యాన్సింగ్ క్వీన్‌' సీక్రెట్ ఏంటోమరి?

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments