Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వీడియో కాల్‌లో భర్తతో మాట్లాడుతూ భార్య ఆత్మహత్య, ఎందుకు?

వీడియో కాల్‌లో భర్తతో మాట్లాడుతూ భార్య ఆత్మహత్య, ఎందుకు?
, మంగళవారం, 27 అక్టోబరు 2020 (21:33 IST)
పుట్టిన ఊరిలో డబ్బులు సంపాదించలేకపోయాడు. బయటి దేశాలకు వెళ్ళి డబ్బులు బాగా సంపాదించి స్వస్ధలానికి వచ్చేద్దామనుకున్నాడు. ఇద్దరు పిల్లలు భార్యను తనకు తెలిసిన ఇంటిలో బాడుగకు ఉంచాడు. పక్కనే సహాయానికి బంధువులు ఉన్నారు. కానీ భర్త లేని లోటు మాత్రం ఆ భార్య జీర్ణించుకోలేకపోయింది. శారీరక సుఖం దూరమవుతోందని భర్త ముందే వీడియో కాల్‌లో మాట్లాడుతూనే ఆత్మహత్య చేసుకుంది. 
 
తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారి జిల్లాలోని విలే ప్రాంతానికి చెందిన సెల్వరాజ్, అంజూ గ్రామానికి చెందిన అగ్నెస్ నందాలకు పదిసంవత్సరాల క్రిమే వివాహమైంది. నాలుగున్నర సంవత్సరాల వయస్సు కలిగిన కుమారుడు, రెండున్నర సంవత్సరాల వయస్సు కలిగిన కుమార్తె ఉన్నారు. 
 
సొంత ఊరిలో కెమికల్ ఇంజనీర్‌గా పనిచేస్తూ ఉండేవాడు సెల్వరాజ్. అయితే అనుకున్నంత సంపాదన రాకపోవడం.. పిల్లలు పెద్దవారైతే భవిష్యత్తు బాగుండదేమోనన్న భయంతో సెల్వరాజ్ కుమిలిపోయాడు. దీంతో రెండుసంవత్సరాల క్రితం భార్యను ఎలాగోలా ఒప్పించి విదేశాల్లో ఉద్యోగం సంపాదించాడు.
 
తన ఇంటి పక్కనే బంధువులు ఉండడం.. భార్యకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా డబ్బులు పంపిస్తూ ఉండేవాడు. అయితే భర్తకు దూరంగా ఉండటం మాత్రం భార్యకు ఏ మాత్రం ఇష్టం లేదు. అయిష్టంగానే ఇంట్లో ఉండేది. ఇదే విషయాన్ని తన స్నేహితులకు అగ్నెస్ నంద చెప్పిందట. ఇదే విషయమై వారంరోజుల క్రితం భర్తతో గొడవపడిందట. సంపాదించింది చాలు ఇక వచ్చేయ్. నేను ఒంటరిగా ఉండలేకున్నా అంటూ సెల్వరాజ్‌ను ప్రాథేయపడిందట. ఐదు సంవత్సరాలు ఇక్కడే ఉండాలి. ఇంకో మూడు సంవత్సరాలే. 
 
సంపాదించి అంతా తీసుకొస్తాను. ఇక మనకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. హాయిగా బతకవచ్చు అని చెప్పాడట. కానీ ఆమె ఒప్పుకోలేదట. దీంతో ఇద్దరీ మధ్య వాగ్వాదం తీవ్రస్థాయిలో జరిగిందట. వీడియో కాల్‌లోనే ఒకరినొకరు అరుచుకున్నారట. దీంతో భర్త ఫోన్ కట్ చేశాడు.
 
మరుసటి రోజు మళ్ళీ ఫోన్ చేసిన సెల్వరాజ్ నిన్న జరిగింది మర్చిపో అంటూ ప్రాధేయపడ్డాడట. సరేనన్న భార్య మళ్లీ భర్తకు ఫోన్ చేసిందట. పిల్లలు బాగా నిద్రపోతున్న సమయంలో రాత్రి వేళలో భర్తకు ఫోన్ చేసి వీడియో కాల్ ఆన్ చేసి మాట్లాడుతూ ఫ్యాన్‌కు ఉరి వేసుకుందట. 
 
అయితే ఇంట్లో పిల్లలు నిద్రపోతూ ఉండటంతో భర్త కూడా ఏమీ చేయలేకపోయాడు. భర్త వీడియో కాల్‌లో ఉండగానే భార్య ఆత్మహత్య చేసుకుందట. రాత్రి వేళ కావడంతో బంధువులు కూడా ఫోన్లను తీయకపోవడంతో చివరకు అగ్నేష్ నంద చనిపోయింది. భార్య చనిపోవడంతో భర్త కుమిలికుమిలి ఏడ్చాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈ యేడాది దేశ జీడీపీ సున్నా : విత్తమంత్రి నిర్మలా సీతారామన్