టీఎస్‌ఆర్టీసీ కార్మికుల బంద్‌కు జనసేనాని మద్దతు

Webdunia
మంగళవారం, 15 అక్టోబరు 2019 (06:39 IST)
తెలంగాణలోని ఖమ్మం బస్సు డిపోలో ఆర్టీసీ డ్రైవర్​ శ్రీనివాస్​రెడ్డి ఆత్మబలిదానంపై జనసేన అధినేత పవన్​ కల్యాణ్​ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం అత్యంత దురదృష్టకరమన్నారు.

తక్షణం ప్రభుత్వం స్పందించి వారిని చర్చలకు పిలవాలని డిమాండ్​ చేశారు. ఆర్టీసీ డ్రైవర్​ శ్రీనివాసరెడ్డి ఆత్మబలిదానం తీవ్రంగా కలచివేస్తోందని జనసేన అధినేత పవన్​ కల్యాణ్​ అన్నారు. ఈ ఘటన అత్యంత దురదృష్టకరమని చింతించారు. ఖమ్మం బస్సు డిపోలో ఆత్మహత్యకు ప్రయత్నంచినప్పుడే ప్రజాప్రతినిధుల జోక్యం చేసుకుని ఆయనతో మాట్లాడితే ఈ దారుణం జరిగేది కాదని అన్నారు.

తన భార్య, పిల్లల ఎదుటే ఆయన మంటల్లో దహించుకుపోవడం... తలచుకుంటేనే గుండె బరువెక్కుతుందన్నారు. కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కూడా ఆయన ఆర్టీసీ కార్మికుల బాగోగుల గురించే ఆలోచించారని ఆవేదన వ్యక్తం చేశారు.

కోరుకున్న తెలంగాణ ఆవిర్భవించిన తరువాత కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం శోచనీయమన్న పవన్​...శ్రీనివాస్​ రెడ్డి కుటుంబానికి ఆయన లోటు తీర్చగలమా అని ప్రశ్నించారు. ప్రభుత్వం తక్షణమే సమస్యలు పరిష్కరించి ఆర్టీసీ కార్మికులలో ధైర్యాన్ని నింపేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆత్మబలిదానాలకు పాల్పడవద్దని కార్మికులందరికీ జనసేనాని విజ్ఞప్తి చేశారు.
 
టీఎస్‌ఆర్టీసీ కార్మికులు బంద్‌కు జనసేనాని పవన్‌కల్యాణ్ మద్దతు ప్రకటించారు. ఈ నెల 19న రాష్ట్ర బంద్‌కు జనసేన పార్టీ మద్దతిస్తోందని తెలిపారు. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యపై జనసేనాని పవన్‌కల్యాణ్ చెలించిపోయారు. ఆర్టీసీ కార్మికులు శ్రీనివాసరెడ్డి, సురేందర్‌గౌడ్ ఆత్మహత్యలు బాధాకరమన్నారు. 
 
ఇకపై ఇలాంటి బలిదానాలు జరగకూడదని ఆయన సూచించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్రరూపం దాల్చిందని చెప్పారు. 48 వేలమందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తామనడం ఆవేదన కలిగిస్తోందని, సమ్మె జఠిలం కాకుండా సమస్యను పరిష్కరించాలని సీఎం కేసీఆర్‌కు పవన్‌కల్యాణ్‌ సూచించారు.
 
టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెపై పవన్ మొదటి నుంచి సానుకూలంగా స్పందిస్తున్నారు. ఉద్యోగులపై ఉదారతను చూపాలని, వాళ్ల సమ్మెను సామరస్యంగా పరిష్కరించాలని కేసీఆర్‌కు పవన్‌ విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. 
 
సకల జనుల సమ్మెలో పాల్గొనడం ద్వారా తెలంగాణ ఉద్యమానికి ఆర్టీసీ ఉద్యోగులు అండగా నిలిచారని, వారు చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకోవాలని కోరారు. 1200 మంది మినహా వాళ్లను ఉద్యోగాల నుంచి తొలగించినట్టుగా వస్తున్న వార్తలు కలవరానికి గురిచేస్తున్నాయని పవన్ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: మన శంకర వరప్రసాద్ గారు చిత్ర బృందానికి పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ శుభాకాంక్షలు

Srinath Maganti: ఈ నగరానికి ఏమైంది సీక్వెల్‌లో హిట్ చిత్ర ఫేమ్ శ్రీనాథ్ మాగంటి

కుక్కకు తులాభారం, ప్లీజ్ మనోభావాలు దెబ్బతింటే క్షమించండి: నటి టీనా శ్రావ్య (video)

జై హో పాటపై ఆర్జీవీ కామెంట్లు.. ఏఆర్ రెహ్మాన్‌ వ్యాఖ్యలపై వర్మ ఎండ్ కార్డ్

Chiranjeevi: మళ్ళీ మన శంకర వరప్రసాద్ టికెట్ ధరలు పెరగనున్నాయా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ సీజన్‌లో వింటర్ ఫ్లూ, న్యుమోనియాను దూరంగా ఉంచడానికి 5 ముఖ్యమైన చిట్కాలు

సెయింట్ లూయిస్‌లో నాట్స్ ఉచిత వైద్య శిబిరం

భోజనం చేసిన వెంటనే ఇవి తీసుకోరాదు, ఎందుకంటే?

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి పాటించాలి

మొలకెత్తిన విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments