Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆర్టీసీ చరిత్ర గురించి మీకు తెలుసా? ఆర్టీసీ మాత్రం ప్రైవేట్‌ చేతిలో ఎందుకు?

ఆర్టీసీ చరిత్ర గురించి మీకు తెలుసా? ఆర్టీసీ మాత్రం ప్రైవేట్‌ చేతిలో ఎందుకు?
, ఆదివారం, 13 అక్టోబరు 2019 (17:35 IST)
మనకు స్వాతంత్య్రం రాక ముందు తెలంగాణను పాలించిన అప్పటి 6వ నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్‌కు ఇద్దరు కోడళ్లు ఒకరు జోహ్రా బేగం. ఈమె టర్కీ రాకుమారి. అయితే నిజాం కోడలుగా పెళ్లి చేసుకున్న పెళ్ళి కొడుకు ఈమెకు మనోవర్తీ అనగా మహర్ రూపంలో అప్పట్లో 2 లక్షల రూపాయలు నగదు ఇచ్చారు. ఇస్లాం మతం ఆచారం ప్రకారం ఆమె మెహెర్ ధనం 2 లక్షల రూపాయిలపై ఆమెకు పూర్తిగా హక్కు ఉంటుంది. 
 
ఆమె ఆ డబ్బులు దాన ధర్మం చేయవచ్చు ఏమైనా చేస్కోవచ్చు. అయితే ఆమే ఏం చేయాలి.. ఏం చేసిన చిరకాలంగా.. పేదలకు ఉపయోగించే విధంగా ఉండాలి అని నిశ్చయించుకొన్నారు. అంతలో ఒక రోజు రాకుమారి గారు నగరంలో పల్లకిలో వెళ్ళుచున్నారు. చాలామంది.. నాంపల్లి రైల్వేస్టేషన్లో రైలు దిగీ నెత్తిన సామానులు పెట్టె పెట్టుకుని చిన్న పిల్లలు. ముసలి వారు. వికలాంగులు రోడ్డు వెంట నానా కష్టాలు పడుతు వెళ్ళుచున్నారు
 
వారిని ఆపి ఎక్కడి నుండి వస్తున్నారు అని అడిగింది. వారు కొందరు నాందేడ్, మరి కొందరు ఔరంగాబాదు, మరి కొందరు వరంగల్ అని చెప్పారు ఇంకా కొందరు నడిచే వస్తున్నాము. అమ్మ.. అని ఏడ్చారు.. అప్పుడు.. రాకుమారి.. అందరూ భగవంతుడు సృష్టించిన మనషులమే, నేను పల్లకిలో వెళ్ళటం ఎందుకు ప్రజలు కష్టాలు పడటం బాగలేదు అని తీవ్రంగా ఆలోచన చేసి వారి మామ గారు ఆరవ నిజాం మీర్ మహబూబ్ అలి ఖాన్ గారితో సంప్రదించి వారి అనుమతి సహకారాన్ని తీసుకుని తన తల్లి తండ్రులు బహుమతి రూపంలో ఇచ్చిన ఆభరణాలు వజ్రాలు, తన స్వంత డబ్బులు మహేర్ ఖర్చు చేసి 9 బస్సు డిపోలు ఏర్పాటు చేయించింది. 
 
50 బస్సులు కొని హైదరాబాద్, నాందేడ్, వరంగల్, ఫర్భనీ, గుల్బర్గా, రాయచూరు, వనపర్తి లలో బస్సు డిపోల నుండి  రైలు స్టేషన్‌కు బస్సులు వెళ్ళాలి జనం తీసుకుని రావడానికి ఆ బస్సులు ఏర్పాటు చేసి దానికి N S R R T D= Nizam state Road and rail Transport Department అని ఏర్పాటు చేశారు. ఇప్పటికీ బస్సుల సీరిస్ నెంబర్ APZ, TS,...z చివరి Z అక్షరం ఆమే పేరు Zohra Begum ఆమే పేరు మొదటి అక్షరం Z గా కొనసాగుతుంది. 
 
అప్పుడు భారత దేశం అనే దేశం లేదు.. బ్రిటిష్ ఇండియాలో ఎక్కడ కూడా ప్రభుత్వంలో ప్రజా రవాణా లేదు. కానీ కేవలం నిజాం రాష్ట్రంలోని ఉంది తర్వాత దీనికి NSRTD అని మార్చి రైల్వే నుండి వేరు చేసి నిజాం ప్రభుత్వంలో కలిపారు. ఇప్పుడు ఆలోచన చేయండి. నిజాం స్థాపించిన అనేక సంస్థలు నీమ్స్, ఉస్మానియా విశ్వవిద్యాలయం, ఉస్మానియా ఆసుపత్రి, నీలోఫర్ ఆసుపత్రి, MNJ cancer hospitals. Assembly, అన్ని సంస్థలు.   ఆసుపత్రులు. ప్రభుత్వంలో ఉంటే RTC మాత్రమే ప్రైవైటులో ఎందుకు ఉంది. 
webdunia
 
అంటే.. 1956. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చి తెలంగాణతో కలిసిన ఆంధ్రలో RTC లేదు. ప్రభుత్వం రంగం లేదు. ప్రైవేటు బస్సులు మాత్రమే ఉన్నాయి. కనుక మన RTC అలా ప్రభుత్వం నుంచి కార్పొరేషన్ అయింది. ఇప్పుడు చెప్పండి RTC ప్రభుత్వంలో పెట్టింది నిజాం సర్కారు. కార్పోరేషన్ (సంస్థ) గా చేసింది అప్పటి ఆంధ్రప్రదేశ్ సర్కార్. తెలంగాణ ప్రభుత్వం కళ్లు తెరవాలి. TS RTCని ప్రభుత్వంలో విలీనం చేయాలి. RTC ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విశాఖలో సెక్స్‌రాకెట్‌ గుట్టు రట్టు.. గుట్టుచప్పుడు కాకుండా ఇంట్లోనే..?