Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆర్టీసీ సమ్మె: తెలంగాణాలో రాష్ట్రపతి పాలనకు రంగం సిద్ధం అవుతుందా?

ఆర్టీసీ సమ్మె: తెలంగాణాలో రాష్ట్రపతి పాలనకు రంగం సిద్ధం అవుతుందా?
, సోమవారం, 14 అక్టోబరు 2019 (12:27 IST)
తెలంగాణలో జరుగుతున్న పరిణామాలను కేంద్ర ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడం ద్వారా గవర్నర్‌కు అధికారాలు కట్టబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

దక్షిణాది రాష్ట్రాల్లో అధికారమే లక్ష్యంగా తెలంగాణపై దృష్టి సారించిన కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం తెలంగాణలో నెలకొన్న ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో శాంతిభద్రతల సమస్య ఉత్పన్నం కానుండటంతో రాష్ట్రపతి పాలన విధించేందుకు బిజెపి ముఖ్యనేతలతో సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 
 
ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా శనివారం హైదరాబాదులో జరిగిన బీజేపీ ఆందోళన కార్యక్రమంలో రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ కంటికి గాయాలు కావడం, అరెస్టులతో పరిస్థితి ఉద్రిక్తం కావడం, ఖమ్మంలో ఆర్టీసీ డ్రైవర్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం, ఒక డ్రైవర్ మరణించడం, తదితర ఉద్రిక్త పరిస్థితులతో రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య రావడంతో రాష్ట్రపతి పాలన విధించేందుకు కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం.
 
ముఖ్యమంత్రి కేసీఆర్ పైన తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో బిజెపి దానిని అనుకూలంగా మార్చుకునేందుకు, కెసిఆర్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసేందుకు కేంద్రం ఏ క్షణంలోనైనా రాష్ట్రపతి పాలన విధించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. అదే జరిగితే ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రభుత్వం లేకుండా గవర్నర్‌కి ప్రత్యేక అధికారాలు లభిస్తాయి. గవర్నర్, పోలీసుల సారధ్యంలో రాష్ట్రంలో కొంతకాలం పాలన సాగే అవకాశం వుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అయోధ్య కేసు: అసలు వివాదం ఏమిటి? సుప్రీం కోర్టు తీర్పు ఎప్పుడు వెలువడుతుంది?