Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణలో సమ్మె మరింత ఉద్ధృతం

తెలంగాణలో సమ్మె మరింత ఉద్ధృతం
, శుక్రవారం, 11 అక్టోబరు 2019 (07:42 IST)
ఆర్టీసీ ఐకాస నాయకులు రెండురోజుల భవిష్యత్​ కార్యాచరణను ప్రకటించారు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసేంతవరకు ఈ సమ్మె కొనసాగిస్తామని తేల్చి చెప్పారు.

ఆర్టీసీ కార్మికులు రేపు బస్ డిపోల వద్ద నిరసన తెలిపి... స్థానిక ప్రజాప్రతినిధులను కలిసి మద్దతు కోరుతామని ఆర్టీసీ ఐకాస నేతలు తెలిపారు. ఎల్లుండి కూడా నిరసన కొనసాగిస్తామని.... జాతిపిత మహాత్మా గాంధీ, ఆచార్య జయశంకర్ విగ్రహాల వద్ద రెండు గంటల పాటు మౌన ప్రదర్శన నిర్వహిస్తామని నేతలు వెల్లడించారు.

ఆర్టీసీ భవిష్యత్ కార్యాచరణలో భాగంగా సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నేతలతో ఆర్టీసీ ఐకాస నేతలు సమావేశమయ్యారు. ప్రభుత్వం బెదిరింపులకు దిగినా... ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా సమ్మె విరమించేది లేదని ఆర్టీసీ ఐకాస నేతలు తెలిపారు. డిమాండ్లను సాధించుకునే వరకు వెనక్కి తగ్గేదిలేదని.... ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోందని నేతలు తెలిపారు.

ప్రభుత్వం తీరును, హైకోర్టు కేసు వివరాలను ఆర్టీసీ ఐకాస నేతలు... రాజకీయ పార్టీల నేతలకు వివరించారు. సమ్మెకు మద్దతు కొనసాగించాలని కోరారు. ఆర్టీసీ కార్మికుల పట్ల ప్రభుత్వం కక్ష్యపూరితంగా వ్యవహరిస్తోందని... ప్రజా రవాణాను, ప్రజాస్వామ్య స్ఫూర్తిని రక్షించాలనే ఉద్దేశంతోనే సమ్మె కొనసాగిస్తున్నట్లు ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి తెలిపారు. సంపూర్ణ మద్దతు ఇస్తామని రాజకీయ పార్టీల నేతలు తెలిపారు.
 
రాజకీయ పార్టీలతో ఆర్టీసీ జేఏసీ సమావేశం.. 
సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆర్టీసీ జేఏసీ నాయకులు వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నేతలతో సమావేశమయ్యారు. ప్రభుత్వ వైఖరి, హైకోర్టు కేసు గురించి ప్రధానంగా చర్చిస్తున్నారు. సమ్మెలో భాగంగా రేపటి నుంచి చేపట్టబోయే నిరసన కార్యక్రమాల గురించి సమాలోచన చేస్తున్నారు.

రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులతో ఆర్టీసీ జేఏసీ నాయకులు బాగ్​లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నారు. ఆర్టీసీ జేఏసీ నేతలు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల నేతలు హాజరయ్యారు. సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, న్యూ డెమోక్రసీ నేత రంగన్నతోపాటు పలువురు ప్రజాసంఘాల నేతలు ఆర్టీసీ సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ప్రభుత్వ వైఖరిని, హైకోర్టు కేసు గురించి ఆర్టీసీ జేఏసీ నేతలు రాజకీయ పార్టీల నేతలకు వివరించారు.

కార్మికుల సమ్మె గురించి ప్రభుత్వం కనీసం పట్టించుకోవడంలేదని, ఏకపక్షంగా వ్యవహరిస్తూ కార్మికులపై కక్ష సాధింపులకు పాల్పడుతోందని ఆర్టీసీ జేఏసీ నేతలు సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు.
 
ర్యాలీలో గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్ మృతి
ఆర్టీసీ సమ్మెలో భాగంగా నిరసన ర్యాలీ నిర్వహించారు. దీనిలో పాల్గొన్న ఆర్టీసీ డ్రైవర్ డి.కొమురయ్య గుండెపోటుతో మరణించాడు. ఉప్పల్ డిపో సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
 
అప్పుల భయంతో ఆర్టీసీ కండక్టరు భర్త మృతి
ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభావం వల్ల ఓ వ్యక్తి మరణించాడు. ఓల్డ్ అల్వాల్​కు చెందిన పద్మ అనే కండక్టర్ భర్త గుండెపోటుతో మృతిచెందాడు. సరైన సమయానికి జీతాలు అందక ఈఎంఐల భారంతో ఒత్తిడిలోనై మరణించాడని కుటుంబ సభ్యులు తెలిపారు.

ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ఉద్యోగం సందిగ్ధంలో పడడం వల్ల ఆందోళనతో ఓ కండక్టరు భర్త మృతిచెందాడు. హకింపేట్​ డిపోలో 15 ఏళ్లుగా కండక్టరుగా పనిచేస్తున్న పద్మ భర్త గుండెపోటుతో మరణించాడు. సకాలంలో జీతాలు అందక ఈఎంఐలు ఎలా చెల్లించాలనే ఆందోళనతో మృతిచెందాడని కుటుంబ సభ్యులు అంటున్నారు.

రఘు మృతికి సంతాపం ప్రకటిస్తూ రిసల బజారు నుంచి అల్వాల్​లోని తెలంగాణ తల్లి విగ్రహం వరకు కాంగ్రెస్​ నాయకులు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినదించారు.
 
ఆర్టీసీ సమ్మెపై కలుగజేసుకోవాలి: గవర్నర్​కు భాజపా వినతి
ఆర్టీసీ కార్మికుల సమ్మెను తెలంగాణ భాజపా నేతలు గవర్నర్ తమిళిసై దృష్టికి తీసుకెళ్లారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, రామచందర్ రావు, జితేందర్‌రెడ్డి, వీరేందర్‌గౌడ్‌ గవర్నర్​ను కలిసి సమస్యను విన్నవించారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దృష్టి లోపాల నివారణే వైయస్సార్ కంటి వెలుగు లక్ష్యం.. తమ్మినేని