Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళతో అక్రమ సంబంధం.. అనుమానంతో చంపేసిన ప్రియుడు

Webdunia
ఆదివారం, 12 సెప్టెంబరు 2021 (16:17 IST)
తన కంటే 12 యేళ్లు తక్కువ వయస్సున్న ఓ వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ దారుణం హైదరాబాద్ నగరంలోని జవహర్ నగర్‌ ఏరియాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కాప్రా ఏరియాలోని పంపూగూడలో 48 యేళ్ల ఓ మహిళ తన కుటుంబం సభ్యులతో కలిసి నివసిస్తుంది. పదేళ్ల కిందట ఆమె సికింద్రాబాద్‌లోని ఓ హోటల్‌లో పనిచేస్తున్న సమయంలో అక్కడే పనిచేస్తున్న అశోక్‌(36)తో పరిచయమైంది. 
 
తనకంటే వయసులో 12 ఏళ్లు చిన్నవాడైన అశోక్‌తో ఆమెకు సాన్నిహిత్యం పెరిగి వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇద్దరూ శారీరకంగా కలుసుకుంటూ వచ్చారు. పెళ్లై పిల్లలున్న అశోక్ ఆరు నెలల కిందట ఎల్లారెడ్డిగూడకి మకాం మార్చాడు.
 
ప్రియురాలిని కలిసేందుకు పంపూగూడలోనే మరో గది అద్దెకు తీసుకున్నాడు. ఇద్దరూ తరచూ అక్కడ కలుసుకునేవారు. ఆ విషయం అశోక్ భార్యకి తెలియడంతో భార్యాభర్తల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. 
 
దానికితోడు ప్రియురాలిపై అశోక్‌ను అనుమానం మొదలైంది. ఆమె తనతోకాకుండా మరికొందరితో శారీరక సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో రగిలిపోయాడు. 
 
ఈ నెల 5వ తేదీన చికెన్ తీసుకొస్తానని ఇంట్లో చెప్పి బయటికొచ్చిన మహిళ ప్రియుడి గదికి వెళ్లింది. ఇద్దరి మధ్య గొడవ జరగడంతో ఆగ్రహానికి గురైన అశోక్ ఆమె గొంతునులిమి కిరాతకంగా హతమార్చాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments