Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తైగున్‌ను హైదరాబాద్‌లో ప్రత్యేక ప్రివ్యూ ద్వారా ప్రదర్శించిన వోక్స్‌వ్యాగన్‌ ఇండియా

Advertiesment
తైగున్‌ను హైదరాబాద్‌లో ప్రత్యేక ప్రివ్యూ ద్వారా ప్రదర్శించిన వోక్స్‌వ్యాగన్‌ ఇండియా
, శనివారం, 11 సెప్టెంబరు 2021 (23:28 IST)
తైగున్‌ అనుభవాలను సొంతం చేసుకునే అవకాశాలను వినియోగదారులకు సాధ్యం చేస్తూ వోక్స్‌వ్యాగన్‌ ప్యాసెంజర్‌ కార్‌ ఇండియా, తమ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎస్‌యువీడబ్ల్యు ప్రత్యేక ప్రివ్యూను హైదరాబాద్‌లో నిర్వహించింది. దక్షిణ భారతదేశంలో ఈ ప్రత్యేక ప్రివ్యూ జరుగుతున్న నాల్గవ నగరంగా హైదరాబాద్‌ నిలువగా, దేశంలో ఈ ఎక్స్‌క్లూజివ్‌ ప్రివ్యూ జరుగుతున్న 5వ నగరంగా ముంబై నిలిచింది.
 
గతంలో బెంగళూరు, చెన్నై, కోయంబత్తూరులలో విజయవంతంగా ఈ ప్రివ్యూలను నిర్వహించారు. ముంబై తరువాత ఈ ప్రివ్యూలను అహ్మదాబాద్‌, కోల్‌కతా, చండీఘడ్‌లలో నిర్వహించనున్నారు. వోక్స్‌వ్యాగన్‌ తైగున్‌, బ్రాండ్‌ యొక్క అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎస్‌యువీడబ్ల్యుగా నిలిచింది. దీనిని భారతదేశంలో  23 సెప్టెంబర్‌ 2021న పండుగ సీజన్‌ మధ్యలో విడుదల చేయనున్నారు.
 
ఈ ఎక్స్‌క్లూజివ్‌ ప్రివ్యూ సమయంలో, ఆసక్తి కలిగిన వినియోగదారులకు వోక్స్‌వ్యాగన్‌ తైగున్‌ అనుభవాలను ముందుగా సొంతం చేసుకునే అవకాశం లభిస్తుంది. దీనితో పాటుగా బ్రాండ్‌ ఇటీవలనే ప్రారంభించిన 360డిగ్రీ విజువలైజర్‌ అనుభవాలను సొంతం చేసుకోవచ్చు.
 
ఈ 360 డిగ్రీ విజువలైజర్‌తో తైగున్‌ ఫీచర్లను వినియోగదారులు సౌకర్యవంతంగా తమ ఇంటిలో ఉండే డిజిటల్‌గా అనుసంధానించబడిన ఉపకరణాలు అయినటువంటి మొబైల్‌ ఫోన్లు, ట్యాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లు లేదా డెస్క్‌టాప్స్‌తో చూడవచ్చు. అదనంగా, వినియోగదారులు  తైగున్‌ పై లభ్యమయ్యే యాక్ససరీలకు సంబంధించిన సమాచారాన్ని సైతం పొందవచ్చు.  తద్వారా తమ జీవనశైలి అవసరాలకు తగినట్లుగా తైగున్‌ ఏ విధంగా సరిపోతుందనే అంశాన్ని వార ముందుగానే తెలుసుకునే అవకాశమూ కలుగుతుంది.
 
ఈ సందర్భంగా శ్రీ అశీష్‌ గుప్తా, బ్రాండ్‌ డైరెక్టర్‌, వోక్స్‌వ్యాగన్‌ పాసెంజర్‌ కార్స్‌ ఇండియా మాట్లాడుతూ, ‘‘దక్షిణ భారతదేశపు మార్కెట్‌ వోక్స్‌వ్యాగన్‌కు అత్యంత ముఖ్యమైన మార్కెట్‌ మరియు ఐటీ కేంద్రంగా నిలిచిన హైదరాబాద్‌లో మా ఎక్స్‌క్లూజివ్‌ ప్రివ్యూ నిర్వహించడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. భారతదేశంలో మా అమ్మకాలకు గణనీయమైన తోడ్పాటును ఈ రాష్ట్రం అందిస్తుంది. అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎస్‌యువీడబ్ల్యు, తైగున్‌ను ప్రదర్శించడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఇది  దేశవ్యాప్తంగా 23 సెప్టెంబర్‌ 2021 న తైగున్‌ను ఆవిష్కరించడానికి మునుపే తైగున్‌ అనుభవాలను సొంతం చేసుకునే అవకాశం వీరికి అందిస్తుంది’’ అని అన్నారు.
 
తమ విలువ ప్రతిపాదన మరియు వినియోగదారుల అనుభవాలను వృద్ధి చేయడానికి వోక్స్‌ వ్యాగన్‌ ఇండియా అవిశ్రాంతంగా కృషి చేస్తుంది. ఈ బ్రాండ్‌ గత కొద్ది నెలలుగా తమ నెట్‌వర్క్‌ ఉనికిని బలోపేతం చేసుకోవడంతో  పాటుగా తమ నూతన బ్రాండ్‌ డిజైన్‌ మరియు లోగోను భారతదేశ వ్యాప్తంగా తమ డీలర్‌షిప్‌ల వద్ద ప్రదర్శిస్తుంది. ఈ నూతన డిజైన్‌ భాష, బ్రాండ్‌ యొక్క ప్రకాశవంతమైన, ఆధునిక, వినూత్నమైన, డిజిటలైజ్డ్‌ మరియు మానవీయ ఔట్‌లుక్‌కు ప్రాతినిధ్యం వహిస్తుంది. వినియోగదారులు మా పీపీఎస్‌ మోటర్స్‌ మరియు మోదీ ఆటో డీలర్‌షిప్‌ను నూతన వోక్స్‌వ్యాగన్‌ అనుభవాలను సొంతం చేసుకోవడం కోసం సంప్రదించవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గణనాథుని ఆశీస్సులు ప్రభుత్వంపై ఎల్లవేళలా ఉండాలి: ఎమ్మెల్యే మల్లాది విష్ణు