Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సాయితేజ్ ఇంటినుంచి ఎక్క‌డికి వెళ్ళాడ‌నేది ఆరా తీస్తున్న పోలీసులు

Advertiesment
సాయితేజ్ ఇంటినుంచి ఎక్క‌డికి వెళ్ళాడ‌నేది ఆరా తీస్తున్న పోలీసులు
, శనివారం, 11 సెప్టెంబరు 2021 (14:40 IST)
Saitej driving ph
వినాయ‌క‌చ‌వితినాడు రాత్రి పూట తీగ‌ల బ్రిడ్డిపై నుంచి ప‌డిన సాయితేజ్ రోడ్డు ప్ర‌మాదం విచార‌ణ ఆరంభ‌మైంది. ఉన్న‌తాధికారులు దీనిపై త‌గిన‌విధంగా ఆరా తీస్తున్నారు. ఇటీవ‌లే కొన్న కొత్త బైక్‌ను పూజ చేయించిన త‌ర్వాత వినాయ‌క‌చ‌వితి రాత్రిపూట త‌న ఇంటి నుంచి బ‌య‌లుదేరాడు. ఇంటి నుంచి ఎక్కడికి వెళుతున్నారు అనే దానిపై విచారణ ప్రారంభించారు. తేజ్ ఇంటి దగ్గర్నుంచి సీనియ‌ర్ నరేష్ ఇంటికి వెళ్ళిన దానిపై ఆరా తీస్తున్నారు. నరేష్ ఇంటి దగ్గర్నుంచి అతని కొడుకు  న‌వీన్‌తో కలిసి తేజ్ బయటికి వెళ్లినట్లు తెలుస్తోంది. బైక్ రేసింగ్ పాల్పడ్డారన్న అనుమానాలపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. నరేష్ కుమారుడు, తేజ్ ఇద్దరూ కలిసి ఎటు వెళ్తున్నారన్న దానిపై విచారణ చేస్తున్నారు.
 
రేస్‌లు మామూలే!
 
గ‌తంలో కొంత‌మంది ఉన్న‌త వ‌ర్గానికి చెందిన పిల్ల‌లు ఔట‌ర్ రింగ్ రోడ్డును రేసింగ్‌గా చేసుకునేవారు. కానీ కొంత‌కాలానికి అక్క‌డ ప్ర‌మాదాలు జ‌ర‌గ‌డంతో కొన్ని కేసులు కూడా పెట్టారు. ప్ర‌భుత్వం అక్క‌డ రేసుల‌ను నిషేధించింది. ఇప్పుడు కొత్త‌గా క‌ట్టిన తీగ‌ల వంతెన‌పై మామూలుగా రాక‌క‌పోక‌లు త‌క్కువ‌. అందులోనూ పండ‌గ‌రోజు రాత్రిపూట ఆ మార్గం ఫ్రీగా వుంటుంది. అందుకే ఈ ప్రాంతాన్ని రేస్‌ల‌కు ఎన్నుకున్నార‌ని పోలీసులు నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. అయితే అందరూ అనుకుంటున్నట్టుగా బైక్ రేసింగ్ లకు పాల్పడితే చర్యలు తీవ్రంగా ఉంటాయి. ఇప్పటికే తేజ్ పై ర్యాష్ డ్రైవింగ్, ఫాస్ట్ గా డ్రైవ్ చేయడంపై కేసు నమోదు చేశారు పోలీసులు. మరోవైపు తేజ, న‌రేష్ కుమారుడు నవీన్, మరో వ్యక్తి కలిసి ఒకే చోట నుంచి బయలుదేరినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకోవైపు తేజ్ ఒక్క‌డే వెళ్ళాడ‌ని కొంద‌రు చెబుతుండ‌గా, ముగ్గురు క‌లిసి వెళ్ళార‌ని పోలీసులు ద‌ర్యాప్తులో తేలింది.
 
హెచ్చ‌రించిన సీనియ‌ర్ న‌రేష్
ఈ విష‌య‌మై సీనియ‌ర్ నరేష్ మాట్లాడుతూ బైక్‌ రైడింగ్‌పై సాయి ధరమ్‌ తేజ్‌ని హెచ్చరించానని, చాలా సార్లు రైడింగ్‌ వద్దని చెప్పానని అన్నారు. సాయి ధరమ్ తేజ్‌ యాక్సిడెంట్ కు ముందు తన ఇంటి నుంచే బయల్దేరాడని తెలిపారు. అలాగే తేజ్‌, తన కుమారుడు ఇద్దరు కలిసి రైడింగ్‌ చేస్తారని ఆయన స్వయంగా వెల్లడించారు. ఇలా జ‌ర‌గ‌డం చాలా బాధాక‌ర‌మ‌ని పేర్కొన్నారు. మ‌రికొంత స‌మ‌యానికి పూర్తి వివ‌రాలు రానున్నాయి.
 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సాయి తేజ్ కు ఇంటర్నల్ బ్లీడింగ్ లేదుః నిర్మాత అల్లు అరవింద్