మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రస్తుత అధ్యక్షుడు సీనియర్ నరేశ్‌కు ఈ ఏడాదిలో జరిగబోయే ఎన్నికల్లో పోటీకి దిగిన మంచు విష్ణు సన్మానం చేశారు. తిరిగి నరేశ్ కూడా మంచు విష్ణను సన్మానించారు. ఇది ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. ఒకవైపు `మా` ఎన్నికలు జరగబోతుండగా వీరి కలయిక యాదృచ్చకమైనా ఏదో జరగబోతోందని సూచనలు తెలియజేస్తున్నాయి. త్వరలో జరగబోయే `మా` ఎన్నికల కోసం ఇటీవలే ప్రకాష్ రాజ్ తన పేనల్‌ను ప్రకటించాడు. అందులో అంతకుముందు అతనికి వ్యతిరేకంగా పోటీకి దిగిన హేమ, జీవిత రాజశేఖర్, జయసుధలను తమవైపుకు ప్రకాష్‌రాజ్ తిప్పుకున్నాడు. ఈ ప్రకియ తర్వాత ప్రకాష్ రాజ్ పేనల్‌కు చెందిన బండ్గగణేష్ జీవిత పేనల్‌లో వుండడంపై వ్యతిరేకించాడు. ఇలాంటి తరుణంలో నరేశ్, మంచు విష్ణులు ఒకరినొకరు సన్మానించే కార్యక్రమం ఆదివారంనాడు జరగడంతో మా సభ్యుల్లో చర్చకు తావిచ్చింది.
అయితే ఇది ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా తన స్కూల్‌కు సంబంధించిన కార్యక్రమంలో భాగంగా మంచు విష్ణు సన్మానం చేసినా ఇందులో ప్రకాష్‌రాజ్‌కు వ్యతిరేకులైన సభ్యులు హాజరయ్యారు. దాంతో ఏదో జరగబోతుందనే సూచనలు కనిపిస్తున్నాయి. సినీపరిశ్రమలో రెండే వర్గాలున్నాయనేది తెలిసిందే. పైకి అంతా ఒక్కటిగా వున్నామన్న అది నటన వరకే. కానీ వాస్తవానికి వచ్చేసరికి ఓ వర్గం ప్రకాష్‌రాజ్‌ను బలపరుస్తుంటే, నాన్ లోకల్‌ను వ్యతిరేకించే మరో వర్గం మంచు విష్ణుకు అండగా వుంది.
కనుక ప్రకాష్‌రాజ్ పేనల్ ప్రకటించిన తర్వాత మంచు ఫ్యామిలీనుంచి ఏదో సెస్సేషనల్ కామెంట్ రాబోతుందని సూచాయిగా విశ్లేషకులు అంచనావేశారు. పైగా ఏకాభిప్రాయంతో ఎన్నిక వుండాలని మంచు విష్ణు గతంలో స్టేట్ మెంట్ ఇచ్చాడు. `మా` భవనం కోసం స్థలం చూశారు. అవసరమైతే స్వంతంగా మంచు కుటుంబమే కట్టి ఇస్తుందని వ్యాఖ్యానించారు. దీనికి కౌంటర్‌గా ప్రకాష్‌ఱాజ్ `మా`ను కట్టే స్తోమత నాకు లేదు. కేవలం మా భవనం కోసమైతే మంచు విష్ణునే గెలిపిస్తారేమో అంటూ సెటైర్ వేశాడు ప్రకాష్ రాజ్. మరి ప్రకాష్‌రాజ్ తెలుగు సంఘానికి అధ్యక్షుడిగా వుండడం అనేది కష్టమనే సూచనలు మాత్రం స్పష్టం కనిపిస్తున్నాయి. ఏం జరుగుతుందో చూడాల్సిందే.