ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైకాపా పార్టీకి చెందిన నేత దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్య అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగింది. మృతుడిని తాడిపత్రి మండలం గన్నేవారిపల్లి వాసిగా పోలీసులు గుర్తించారు. ఈయన మృతదేహం ఆదివారం ఉదయం పెన్నా నదిలో లభ్యమైంది.
అయితే.. పోతులయ్యను చంపిన అనంతరం దుండగులు పెన్నా నదిలో పడేసినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. హత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోతులయ్య మృతి ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా.. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.