Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జోర్‌సే బార్‌సే అంటూ పాడుకుంటున్న‌ సాయితేజ్

Advertiesment
జోర్‌సే బార్‌సే అంటూ పాడుకుంటున్న‌ సాయితేజ్
, సోమవారం, 6 సెప్టెంబరు 2021 (16:42 IST)
Saitej dance
జోర్‌సే బార్‌సే తెర‌సాప జార్‌సే పడవనింక జోర్ సే, అంటూ హుషారైన పాట‌కు ల‌య‌బ‌ద్ధంగా స్టెప్‌లేస్తున్నాడు సాయితేజ్‌. దేవ్ క‌ట్టా ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న `రిపబ్లిక్` సినిమా కోసం పాట వివ‌రాల‌ను చిత్ర యూనిట్ సోమ‌వారంనాడు విడుద‌ల చేసింది. ప‌ల్లెటూరిలో జ‌రిగే పండ‌గ వాతావ‌ర‌ణం అక్క‌డ హీరో, హీరోయిన్ మ‌ధ్య హుషారుగా వ‌చ్చే సాంగ్‌లా అనిపిస్తుంది. మ‌ణిశ‌ర్మ సంగీత సార‌థ్యం వ‌హించిన రిప‌బ్లిక్ చిత్రంలో ఈ పాట‌ను సుద్దాల అశోక్ తేజ రాశారు. అనురాగ్ కుల‌క‌ర్ణి, సాకి శ్రీనివాస్‌, బ‌రిమి శెట్టి పాడారు.
 
పొలిటిక‌ల్ థ్రిల్లర్ గా రూపొందుతోన్న రిప‌బ్లిక్ సినిమా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 1న విడుదలవుతుంది. జీ స్టూడియోస్‌ సమర్పణలో జె.బి.ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై ఈ చిత్రాన్నినిర్మాత‌లు జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మిస్తున్నారు. ఈ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి.
 
సినిమా ప్రమోషన్‌ను డిఫరెంట్‌గా ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా సినిమాలో కీల‌క పాత్ర‌ల లుక్స్‌ను, వాటికి సంబంధించిన బ్యాక్‌డ్రాప్‌ను విడుద‌ల చేస్తూ వ‌స్తున్నారు. ఇప్పటికే హీరో సాయితేజ్, హీరోయిన్ ఐశ్వర్యా రాజేశ్, కీలక పాత్రధారులు జగపతిబాబు, రమ్యకృష్ణ పాత్ర‌ల‌కు సంబంధించిన లుక్స్‌తో పాటు ‘గానా ఆఫ్ రిపబ్లిక్..’ సాంగ్ విడుదలై ఆకట్టుకోగా ఇప్పుడు ‘జోర్ సే’ సాంగ్ విడుదలైంది.
 
సాయితేజ్ యాక్టింగ్‌, దేవ్ క‌ట్టా మార్క్ టేకింగ్ డైలాగ్స్‌తో సినిమాపై ఆసక్తి నెలకొంది. మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఎం.సుకుమార్ సినిమాటోగ్రాఫ‌ర్‌. కె.ఎల్‌.ప్ర‌వీణ్ ఎడిట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వీరమల్లు త‌ర్వాతే ప‌వ‌న్‌తో మైత్రీమూవీస్ చిత్రం