Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

"టక్ జగదీష్" నుంచి ట్రైలర్ వచ్చేైసింది.. రిలీజ్ ఎప్పుడంటే? (video)

Advertiesment
, బుధవారం, 1 సెప్టెంబరు 2021 (20:42 IST)
"టక్ జగదీష్" సినిమా వినాయక చవితి సందర్భంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది యూనిట్. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌‌ను కాసేపటి క్రితమే విడుదల చేసింది. 
 
ట్రైలర్‌ చూశాక… ఈ సినిమా పూర్తిగా ఫ్యామిలీ సెంటీమెంట్‌ ఆధారంగా నడుస్తుందని తెలుస్తోంది. అలాగే.. ఈ సినిమాలో చాలా సెంటీమెంట్‌ సన్నివేశాలు కూడా ఉన్నాయి. ఇక అటు ఇద్దరు హీరోయిన్లు కూడా కీలకంగా ఉన్నట్లు అర్థమౌవుతోంది. 
 
ఇక ట్రైలర్‌ చూసాక… ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. కాగా… ఈ సినిమా అమేజాన్‌ ప్రైమ్‌‌లో ఈ సినిమాను విడుదల కానుంది. 
 
ఇకపోతే.. నాచురల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ డైరక్షన్‌లో వస్తున్న ఈ సినిమా ”టక్ జగదీష్”. షైన్ స్క్రీన్ బ్యానర్‌లో వస్తున్న ఈ సినిమాలో నాని సరసన రీతు వర్మ, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. 
 
ఇక ఈ సినిమా‌లో జగపతి బాబు కీలక పాత్ర చేస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్ 23న రిలీజ్ కావాల్సింది. కానీ కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడింది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పూరీకి తర్వాత ఛార్మీ.. ఈడీ ఎదుట రేపు హాజరు