ప్రస్తుతం కరోనా అందరి జీవితాలను తారుమారు చేసిందనేది తెలిసిందే. సినిమారంగంలో ఎక్కువ ప్రభావం చూపింది. కరోనా సెకండ్‌వేవ్ తర్వాత తెలుగు ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారనీ, ప్రపంచంలో ఎక్కడా లేని వాతావరణం మనద గ్గరే వుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే సినిమాలు విడుదలవుతున్నాయి. కానీ ప్రేక్షకులే రాలేకపోతున్నారు. మొదటిరోజు మాత్రం థియేటర్లలో సినిమా యూనిట్ సందడి చేస్తోంది. దాంతో కాస్త కలెక్షన్లు వస్తున్నాయనేలా కనిపిస్తున్నాయి. కానీ ఆ తర్వాత రోజునుంచి ఏ థియేటర్ చూసినా పలచగానే కనిపిస్తున్నాయ్.
గత నెలరోజులుగా విడుదలయిన సినిమాల విషయం ఇలానే వుంది. ఎస్.ఆర్. కళ్యాణ మండపం మాత్రం వారిచ్చిన పబ్లిసిటీతోపాటు కొత్తగా థియేటర్లలో చూడాలన్న ఆరాటంతో కొద్దిరోజులు ఆడింది. ఆ తర్వాత విడుదలైన సినిమాల పరిస్థితి మరీ దారుణం.
కొన్ని సినిమాలు ఎప్పుడు వచ్చాయో ఎప్పుడు వెల్ళాయో తెలీకుండా వుంది. ఇలాంటి టైంలో శ్రీదేవి సోడా సెంటర్ వచ్చింది. హీరో సుధీర్‌బాబు కృషి, దర్శక నిర్మాతల కష్టం కనిపించింది. దాంతో పలు సంస్థలు వెబ్‌సైట్లు రేటింగ్ బ్రహ్మాండగా ఇచ్చేశాయి. కేవలం రెండు రోజులపాటే థియేటర్లలో జనాలు వచ్చారు. కానీ ఆ తర్వాత ప్రేక్షకుల ఆదరణలేదు. ఇక ఆతర్వాత ఇక్కడ వాహనాలు నిలుపరాదు సినిమా పరిస్థితి కూడా అంతే. సూర్యస్తమయం వంటి చిన్న సినిమాలు దాదాపు నెలరోజులపాటు 15వరకు విడుదలయ్యాయి. కానీ ఎక్కడా పట్టుమని రెండురోజులు ఆడింది లేదు. దాంతో ఏమి చేయాలో ఎగ్జిబిటర్లకు, నిర్మాతలకు పాలుపోవడంలేదు.
ఇలాంటి పరిస్థితి గమనించే నాని తన టక్‌జగదీష్ సినిమాను ఓటీటీలో విడుదలచేసినట్లు తెలుస్తోంది. థియేటర్‌కంటే ఓటీటీలో మంచి రేటు రావడం కూడా ఓకారణంగా ట్రేడ్‌వర్గాలు చెబుతున్నాయి. ఇదే రూటులో శేకఱ్ కమ్ముల లవ్‌స్టోరీ థియేటర్‌లో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే లవ్‌స్టోరీ నిర్మాత, ఎగ్జబిటర్ల్ కూడా తన బాధనుఇలా వ్యక్తం చేశాడు. టక్‌జగదీష్ ఓటీటీలో వచ్చినరోజే మా లవ్‌స్టోరీ థియేటర్‌కు వస్తే మా సినిమాపై ప్రభావం పడుతుంది. కనుక నాని సినిమాను వాయిదా వేసుకోవాలని బహిరంగంగా చెప్పాడు. కానీ ఈ విషయంలో టక్‌జగదీష్ నిర్మాతలు, హీరో చేతులెత్తేశారు. ఓటీటీకి ఇచ్చాక మాదేంలేదని తేల్చారు. మొత్తంగా పరిశీలిస్తే మెగాస్టర్, పవర్‌స్టార్ సినిమాలేమైనా థియేటర్‌లో విడుదలయితే కానీ ప్రేక్షకులు వస్తారని మాత్రం ఎగ్జిబిటర్లు అంచనా వేస్తున్నారు. అప్పటివరకు థియేటర్లకు కష్టాలు తప్పవని అర్థమవుతోంది.