సహజ నటుడు నాని నటించిన `టక్ జగదీష్` ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటి. 'నిన్నుకోరి` వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత నేచురల్ స్టార్ నాని, శివ నిర్వాణ కాంబినేషన్‌లో ఈ చిత్రం రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన పాటలు శ్రోతలను అలరిస్తుండగా టీజర్, ఇటీవల విడుదలైన ట్రైలర్ అందరి ప్రశంసలను గెలుచుకుంది.
ఈ రోజు గోపి సుందర్ స్వరపరిచిన ఈ చిత్రంలోని `టక్ పాట`ను విడుదలచేసింది చిత్ర యూనిట్. ఈ సారి ఒక ఇంటెన్స్ నెంబర్ సాంగ్‌తో మనముందుకు వచ్చారు. ఈ పాటను దర్శకుడు శివ నిర్వాణ స్వయంగా పాడడం విశేషం. ఈ పాట యొక్క శైలికి తగ్గట్టుగా ఆయన వాయిస్ చాలా ఎనర్జిటిక్‌గా ఉంది. ఈ పాటలో నాని మాస్, యాక్షన్ అవతారంలో కనిపించనున్నారు.
అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన టక్ జగదీష్ వినాయక చవితి కానుకగా సెప్టెంబర్10 నుండి అమేజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది.
రీతు వర్మ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్ కీలకపాత్రలో నటిస్తుంది, నాని సోదరుడిగా విలక్షణ నటుడు జగపతిబాబు కనిపించనున్నారు. నాని 26వ చిత్రంగా రూపొందుతోన్న ఈ మూవీని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.